గుడ్ న్యూస్.. బజాజ్ ఫైనాన్స్ అదిరిపోయే ఆఫర్?

praveen
సొంత ఇల్లు కట్టుకోవాలి అన్నది ప్రతి ఒక సామాన్యుడికి కలగా ఉంటుంది. ఇలా సొంతింటి కళ నెరవేర్చుకోడానికి ఎన్నో రోజుల నుంచి డబ్బును పోగు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.  ఇక సరైన సమయం చూసి ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు తక్కువ ఉంటే.. ప్రస్తుతం రుణం అందించేందుకు కూడా ఎన్నో రకాల కంపెనీ లు సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది కస్టమర్ లకు రుణ సదుపాయాన్ని కల్పించి సొంతింటి కలను సాకారం అయ్యేలా చేసింది బజాజ్ ఫైనాన్స్.

 బజాజ్ ఫైనాన్స్ ఇప్పటికే తమ వినియోగదారులకు ఎన్నో రకాల రుణ సదుపాయాలను కల్పిస్తుంది.  ఇక కస్టమర్ల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా లోన్స్ అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఇక ఇటీవల బజాజ్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ అయిన బజాజ్ హోమ్ లోన్స్ ఇటీవలే తమ కస్టమర్లను వారికి ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది  హోమ్ లోన్  కేవలం 6.7 శాతం వడ్డీ రేటుకి అందించేందుకు సిద్ధమైంది.  అయితే క్రెడిట్ స్కోర్ బాగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అని తెలిపింది.

 అంతేకాకుండా ఇక హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్లు.. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు కూడా వీలు ఉంటుంది. ఇలా చేయడం వల్ల తక్కువ వడ్డీ పొందేందుకు అవకాశం ఉంటుంది. అంతే కాదు లోన్  కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కేవలం ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటే సరిపోతుంది. క్రెడిట్ స్కోర్, ఆదాయం, జాబ్ రికార్డ్ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని రుణాన్ని అందిస్తుంది బజాజ్ ఫైనాన్స్. అయితే వీటి ఆధారంగానే అటు హోమ్ లోన్ ఎంత వస్తుంది అన్నది కూడా నిర్ధారిస్తూ ఉంటుంది  . గరిష్టంగా హోమ్ లోన్ పై ఐదు కోట్ల వరకు రుణ సదుపాయాన్ని అందిస్తుంది బజాజ్ ఫైనాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: