మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..!

Veldandi Saikiran
గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తో పాటు గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్న సంగతి విధితమే.  కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్ మరియు డీజిల్ అలాగే గ్యాస్ ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధరలు సెంచరీ దాటగా డీజిల్ ధరలు పెట్రోల్ ధరల ను ఓవర్టేక్ చేస్తున్నాయి. అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు కూడా సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక తాజాగా మరో సారి  ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయాయి. 

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లు ఎల్పీజీ ధరలను పెంచుతూ అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇక ఈ పెరిగిన ధరలు అక్టోబర్ ఒకటో తారీకు నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించాయి ఆయిల్ కంపెనీలు. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది. ఈ పెరిగిన ధరల కారణంగా సామాన్యులపై ఎలాంటి భారం కూడా పడదని ప్రకటించాయి ఆయిల్ కంపెనీ.  19 కేజీల సిలిండర్ ధర పై మాత్రమే రేటు పెంచామని ప్రకటించాయి ఆయిల్ కంపెనీలు. 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఈ సారి ఏకంగా రూ. 45 పెంచుతున్నట్లు వెల్లడించాయి ఆయిల్ కంపెనీలు.

ఇక ఆటో 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధర మాత్రం స్థిరం గానే ఉండటం గమనార్హం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడం కారణంగా ఈసారి సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి కంపెనీలు. మరో నెల రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఆగడు 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 884 గా ఉంది. అలాగే కోల్కత్తాలో 911 రూపాయలు, ముంబైలో ఎల్పీజీ సిలిండర్ ధర 884 రూపాయలుగా ఉంది. అటు చెన్నై లో సిలిండర్ ధర 900 రూపాయలుగా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: