గుంటూరులో కొత్త మంత్రులు వీళ్లేనా ... వీళ్లకు లక్కీ ఛాన్సే ...!
ఇక ఇప్పుడు జిల్లాకు ఒక్క సుచరిత మాత్రమే మంత్రిగా ఉన్నారు. ఇక ఇప్పుడు మార్పుల్లో ఆమె తన పదవిని నిలుపు కుంటారా ? జిల్లాకు రెండో మంత్రి పదవి వస్తుందా ? అన్నదే సస్పెన్స్. కమ్మ కోటాలో జగన్ హామీ ఇచ్చిన చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయన మంత్రి అవ్వాలంటే ముందుగా ఎమ్మెల్సీ అవ్వాలి. అయితే ఆయనకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఆయన కు మంత్రి పదవి ఇస్తానిన జగన్ బహిరంగంగా హామీ ఇచ్చారు.
ఇక మంగళగిరి లో లోకేష్‌ను ఓడిస్తే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని సైతం మంత్రిని చేస్తానన్నారు. అయితే రెడ్డి మంత్రులు ఎక్కువుగా ఉండడంతో ఆళ్ల కోరిక తీరుతుందా ? అన్నది సస్పెన్స్. ఇక బ్రాహ్మణ కోటాలో బాపట్ల నుంచి రెండో సారి గెలిచి డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతి ఆశలతో ఉన్నారు. ఇక అందరి కన్నా సీనియర్ అయిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సైతం తనకు విప్ పదవి వద్దని మంత్రి పదవి కావాలని కోరుతున్నారు. మరి వీరిలో జగన్ ఎవరి కోరిక తీరుస్తారో ? చూడాలి.