అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యల పై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అయ్యన్నపాత్రుడి కి 48 గంటల డెడ్ లైన్ పెట్టానని.. బహిరంగ క్షమాపణ చెప్ప క పోతే ఎన్నికల ఫలితాల తర్వాత జర గబోయే పరిణామాలు తమ చేతు ల్లో ఉండవని అయ్యన్నపాత్రుడిని హెచ్చరించారు మంత్రి అవంతి శ్రీనివాస్ . ప్రాదేశిక ఎన్నికల ఫలితా ల్లో ఏకపక్షంగా ఉండ బోతున్నాయని..ఈ విధంగా టిడిపి నాయకులు వ్యవహ రిస్తున్నారని నిప్పులు చెరిగారు. అయ్యన్న పాత్రుడు సప్త వ్యసనపరుడు అని మండిపడ్డారు. అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు...జగన్ అభిమాను లను రెచ్చ గొట్టాలనే చంద్రబాబు కుట్ర లో భాగం గానే అయ్యన్న వ్యాఖ్యలు చేశారని నిప్పులు చెరిగారు మంత్రి అవంతి శ్రీనివాస్.
ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ ని విజ్ఞప్తి చేస్తున్నా....దళిత హోం మంత్రి పై బహిరంగ వేదికల పై విమర్శలు చేసిన అయ్యన్న ను అరెస్ట్ చేయాలన్నారు. ఆయన పై సుమోటో గా పోలీసులు కేసు తీసుకోవాలని.. అయ్యన్న క్షమాపణ అయినా చెప్పాలి లేదా అరెస్ట్ అయినా అవ్వాలని పేర్కొన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ప్రజాభిమానం పొందలేక దురుద్దేశంతోనే టీడీపీ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది...60 ఏళ్ల వయసు, అనుభవం కలిగిన అయ్యన్న వ్యాఖ్యలు చూస్తే ఆయన మానసిక స్థితి పై అనుమానం కలుగుతోందని వెల్లడించారు మంత్రి అవంతి శ్రీనివాస్ . ఖబడ్దార్ అయ్యన్న, ఖబడ్దార్ చంద్రబాబు.. అయ్యన్నపాత్రుడు కాపు, దళిత వ్యతిరేకి అని తెలిపారు మంత్రి అవంతి శ్రీనివాస్.
360 రోజులు మద్యం మత్తులోనే ఉంటాడు...ఆ రోజు కూడా మద్యం తాగే అయ్యన్న మాట్లాడినట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అయ్యన్నపాత్రుడు వైఖరి నచ్చక స్వయంగా సోదరుడు వైసీపీలో చేరారు....అయ్యన్న సోదరుడుకి డిసిసిబి పదవి ఇచ్చిన పార్టీ వైసీపీ అని వెల్లడించారు.. అయ్యన్న వ్యాఖ్యలు వీధి రౌడీ కంటే దారుణంగా ఉన్నాయని.. 13 జిల్లా పరిషత్ స్థానాల్లోనూ వైసీపీదే విజయమన్నారు.