తిరుగు లేని నాయకుడిగా పిఎం మోడీ !

Veldandi Saikiran
గుజరాత్ రాష్ట్ర సీఎం గా పని చేసి తిరుగు లేని నాయకుడిగా ఎదిగారు నరేంద్ర మోడి. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఎంతోమంది ప్రజల మన్ననలను పొందారు. 2వ సారి  దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం... ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విదేశాల నుంచి మన ఇండియాకు మద్దతు పెంచేందుకు మరియు అంతర్జాతీయంగా ఇండియాను ముందువరుసలో ఉంచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారు. అటు భారతీయ జనతా పార్టీ నీ,  ఇటు భారతదేశాన్ని దీంతో చాకచక్యంతో ముందుకు సాగిస్తున్నారు. ప్రధానిగా ఎన్నో విషయాలు సాధించిన నరేంద్ర మోడీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ వస్తోంది. 

 

ఇదిలా ఉండగా... 2014 నుంచి ఇప్పటివరకు ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు కూడా మద్దతు తెలపడం హర్షించదగ్గ విషయం. ప్రజల నుంచి మంచి మద్దతు రావడం కారణంగానే... 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ విజయం సాధించగలిగారు. దేశ ప్రధానిగా ఏడేళ్లు సుదీర్ఘంగా పాలించిన ప్రధాని నరేంద్ర మోడీ... కీలక చట్టాలు మరియు పథకాలు ఇలా ఎన్నో తీసుకోవచ్చా రు. ఇందులో ముఖ్యంగా జిఎస్టి మరియు నోట్ల రద్దు లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు నరేంద్ర మోడీ. అలాగే అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు కూడా కల్పించారు. జీరో అకౌంట్ పేరుతో అకౌంట్లు ఇప్పించడం, రైతుల కోసం పెట్టుబడి సాయం, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్, ఇలా ఎన్నో పథకాలను మరియు కార్యక్రమాలు చేపట్టారు నరేంద్ర మోడీ.

అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజల కోసం ఎన్నో పథకాలు కార్యక్రమాలు తీసుకువచ్చినా... కొన్ని విజయవంతం కాగా మరికొన్ని కార్యక్రమాలు మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీశాయి.  ఇందులో ముఖ్యంగా జీఎస్టీ మరియు నోట్ల రద్దు. ఈ రెండు నిర్ణయాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ... తీవ్రంగా దెబ్బతింది. జీఎస్టీ కారణంగా రాష్ట్రాలు ఆశయాన్ని కోల్పోగా... నోట్ల రద్దు కారణంగా  చిరు వ్యాపారులకు ఉపాధి కరువైంది. అలాగే నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది.అలాగే... ముఖ్యంగా కరోనా విషయంలో... మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని వాదనలు ఉన్నాయి.  ఇలా నరేంద్ర మోడీ పాలనలో... కొన్ని ప్రజలకు మేలు చేస్తూ ఉంటే మరికొన్ని ఏమో...  నష్టాన్ని చేకూరుస్తున్నాయి.  ఇలా మిశ్రమ ఫలితాలతో ప్రధాని నరేంద్ర మోడీ తన పాలన కొనసాగిస్తున్నారు. మొత్తానికి 7 ఏళ్ల పరిపాలనలో... తన సొంత ఇమేజ్ ను ఏమాత్రం కోల్పోని గొప్ప నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎదిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: