అఫ్గాన్‌: కాబూల్‌ ఐఎస్‌ దాడుల వెనుక అసలు రహస్యం ఇదే..?

Chakravarthi Kalyan
అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌ లో కొన్నిరోజుల క్రితం జరిగిన వరుస బాంబు దాడుల ఘటనల్లో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ దాడులతో తమకేమీ సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ దాడులకు తామే కారణమని ఐఎస్‌ తీవ్రవాదులు ప్రకటించుకున్నారు. దీంతో ..అంతా అది ఇస్లామిక్‌ తీవ్రవాదుల పనే అనుకున్నారు. అమెరికా సైనికులు సొంతదేశానికి వెళ్తున్న సమయంలో జరిగిన దాడి కాబట్టి ఆ దాడుల టార్గెట్ కూడా అమెరికన్లే అనుకున్నారు. ఈ దాడుల్లో అమెరికా పౌరులు దాదాపు 13 మంది వరకూ చనిపోయారు కూడా.

అయితే తాజాగా వెలుగు చూస్తున్న షాకింగ్ న్యూస్ ఏంటంటే.. అసలు.. ఈ వరుస దాడుల వెనుక ఉన్న సూత్రధారి తాలిబనేనట. ఎందుకంటే.. తాలిబన్లు అప్పటికే అఫ్గాన్ మొత్తం ఆక్రమించుకున్నారు. కాబూల్‌ ఎయిర్‌పోర్టులో అమెరికా సైన్యాలు ఉన్నాయి. మరి ఈ ఐఎస్‌ తీవ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు. ఇందరిని దాటుకుని వాడు ఎలా వచ్చి వరుస పేలుళ్లు జరిపి వంద మందికి పైగా పొట్టన పెట్టుకున్నారు. ఒక వేళ ఇది ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల పనే అయినా.. తాలిబన్ల సహకారం లేకుండా జరిగే అవకాశమే లేదు.

మరి ఎందుకు తాలిబన్లు ఇలాంటి వ్యూహం పన్నారు.. దీనిపై అనేక వాదనలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది.. అఫ్గాన్‌ నుంచి వివిధ రంగాల్లో నిపుణులు ఇప్పుడు అఫ్గాన్‌ వదిలి వెళ్లిపోతున్నారు. టెక్నికల్ పీపుల్ దేశం విడిచి వెళ్తున్నారు. ఈ మేధావుల వలసను అడ్డుకోలేకపోతే.. ముందు ముందు అఫ్గాన్‌లో మేధావులే ఉండరు. ఇప్పటికే అఫ్గాన్‌లోని అనేక మంది వివిధరంగాల ప్రముఖులను బ్రిటన్, అమెరికా వంటి దేశాలు ఆకర్షిస్తున్నాయి. దీనికి తోడు వీరు తక్కువ వేతనానికే పని చేస్తారు కాబట్టి వీరి తెలివితేటలు వారికి అవసరం. అలా మేధావులు వలస వెళ్లిపోతున్నారు కాబట్టి .. వారిని ఆపేందుకు తాలిబన్లే ఈ దాడులు చేయించారని అనేక అమెరికన్ పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: