వైఎస్ షర్మిలకు షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ?

Veldandi Saikiran
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి... తనదైన దూకుడుతో కాంగ్రెస్ పార్టీ కి తిరిగి పూర్వ వైభవం తేవాలని చాలా కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే... ప్రజల సమస్యలను లేవనెత్తు టీఆర్ఎస్ పార్టీని ఎండగడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే గిరిజన దళిత ఆశీర్వాద లాంటి కార్యక్రమాలు చేపట్టి.... కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు మరింత... ఉత్సాహం నింపుతున్నారు. అటు ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు రేవంత్ రెడ్డి. అలాగే.... అధికార టీఆర్ఎస్ పార్టీ పై ప్రతిరోజు ప్రెస్ మీట్ నిర్వహించి.... ప్రజల సమస్యలను వెలికి తీస్తున్నారు. అయితే టిఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తూనే ఇటు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. 


ఇందులో భాగంగానే వైయస్ షర్మిల పార్టీ పై రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారని సమాచారం. ఇటీవల వైయస్ షర్మిల పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇందిరా శోభన్ రాజీనామా వ్యవహారం వెనకాల కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైయస్ షర్మిల పార్టీ కారణంగా రెడ్డి ఓట్లు మరియు దళిత క్రైస్తవుల ఓట్లు.... చీలే అవకాశం ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ వ్యూహం పన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. షర్మిల పార్టీ కారణంగా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో..... ఆ పార్టీనే రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని తెలుస్తోంది.


ఇందులో భాగంగానే ఇందిరా శోభన్ కు ఓ భారీ ఆఫర్ ను... రేవంత్ రెడ్డి ప్రకటించారని... ఈ నేపథ్యంలోనే ఆమె షర్మిల పార్టీకి రాజీనామా చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే సీతక్క పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్వయంగా ఎమ్మెల్యే సీతక్క... ఇంద్ర శోభన్ కు ఫోన్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ లోకి చేరమని అడిగినట్లు తెలుస్తోంది. ఇక అటు ఇంద్ర శోభన్ పార్టీ వీడటంపై వైయస్ షర్మిల దృష్టి పెట్టారని తెలుస్తోంది. తిరిగి మళ్లీ పార్టీలోకి రావాలని.... ఇందిరా శోభన్ కు వైయస్ షర్మిల కూడా ఓ మంచి ఆఫర్ కూడా ఇచ్చిందని సమాచారం అందుతోంది. అయితే ఇది ఈ ఆఫర్ ను ఇందిరా శోభన్ తిరస్కరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇందిరా శోభన్ ఎపిసోడ్ వెనుక రేవంత్ రెడ్డి వ్యూహం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: