అవినీతి, దుబారా వల్ల ఏపీ లో ఆర్థిక సంక్షోభం ?

Veldandi Saikiran
టిడిపి పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ  చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  28-08-21 తేదీన పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరల పెంపు పై టీడీపీ నిరసన కార్యక్రమం ఉంటున్నారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లింపు విషయంలో రూ.413 కోట్లు డిపాజిట్ చేశామని చెబుతున్నా.. అవి కాంట్రాక్టర్లకు అందలేదని పేర్కొన్నారు.  కేంద్రం రూ.1,991 కోట్లు నరేగా బకాయిలను విడుదల చేసినా వాటిని ఇవ్వకుండా దారి మళ్లించడాన్ని, కోర్టు ధిక్కరణకు పాల్పడటాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.  జాతీయ ఎస్సీ కమిషన్ కు టీడీపీ తరపున అత్యాచారాలు, హత్యలు, అట్రాసిటీ చట్టం దుర్వినియోగం పై నివేదిక ఇవ్వాలని సమావేశంలో తీర్మానించడం జరిగిందన్నారు.

అగ్రిగోల్డ్ విషయంలో బాధితులకు మొత్తం నగదు ఇవ్వాలని... అగ్రిగోల్డ్ ఆస్తులను అండర్ వాల్యూకి ధారాదత్తం చేయరాదని హెచ్చరించారు.   దశల వారీ మద్య నిషేధం పేరు తో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మాట తప్పారని మండిపడ్డారు.   నాసిరకం మద్యం తో పాటు ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు. కోవిడ్ నియంత్రణలో జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారన్నారు చంద్రబాబు.   కరోనా లోనూ పన్నులు, ధరలు పెంచి వేల కోట్లు భారాలు ప్రజల పై మోపారని మండి పడ్డారు.   

తెచ్చిన రూ.2 లక్షల కోట్ల అప్పు ఏం చేశారు ? అవినీతి, దుబారా వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చిందన్నారు.   ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి చట్ట బద్ధంగా రావాల్సిన నిధులు, సాయం అందడం లేదని పేర్కొన్నారు.   జగన్ రెడ్డి పాలన లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించి వేస్తున్నారన్నారు.  తెలుగు దేశం పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని.. జగన్ రెడ్డి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందారని ఫైర్ అయ్యారు.   జగన్ రెడ్డి మోసాలను రెండేళ్ల లోనే ప్రజలు గ్రహించారని... నీలి మీడియా అబద్ధాల ప్రచారం నుంచి ప్రజలు బయటపడుతున్నారన్నారు. సరైన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: