హుజూరాబాద్ నియోజక వర్గం లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మరో షాక్ తగిలింది. ఈటల రాజేందర్ కు ముఖ్య అనుచరుడు మరియు ఉద్యమ కారుడు అయినటు వంటి పోచమల్లు అధికార టీ ఆర్ ఎస్ పార్టీలోకి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా ఉద్యమ కారుడు పోచమల్లు ను టిఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఇక అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... ఈటల రాజేందర్ పెట్టిన కష్టాలకు ఈ రోజు తెరాస లోకి పోచమల్లు వచ్చాడని వెల్లడించారు.
పోచమల్లు టిఆర్ఎస్ పార్టీ లోకి రావడం తో ఈ రోజు న్యాయం మరియు ధర్మం గెలిచ్చిందన్నారు మంత్రి హరీష్ రావు. ఈటల మాటలకు చేతలకు సంబంధం లేదని.. రక్త సంబంధం కంటే మానవ సంబంధం గొప్పది అన్న ఈటల ఈరోజు మత్తతత్వ పార్టీలో చేరడని చురకలు అంటించారు హరీష్ రావు. మాట్లాడే మాటలు మానవత్వమని.. మాటలు, మనస్తత్వం ఎర్రజెండా తత్వమని స్పష్టం చేశారు. తల కిందికి కాళ్లు పైకి పెట్టినా హుజూరాబాద్ నియోజక వర్గం లో ఈటల రాజేందర్ గెలవడం చాలా కష్టమని హరీష్ రావు జోష్యం చెప్పారు.
హుజూరాబాద్ నియోజక వర్గం టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీను టిఆర్ఎస్వీ నుండి 2001 ఏడాది నుండి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఉస్మానియా లో ఉద్యమాన్ని ఉవెతున్న ఉరుకెచ్చిన వ్యక్తి గెల్లు శ్రీను అని కొనియాడారు హరీష్ రావు. ఉద్యమం నుండి వచ్చిన వ్యక్తుల గెలుపు ఖాయమన్న మంత్రి హరీష్ రావు.. ఈటల ఎన్ని ప్రయత్నాలు చేసిన గెలుపు అంతా సులభం కాదన్నారు. హుజూరాబాద్ నియోజక వర్గం టిఆర్ఎస్ పార్టీ అడ్డా అని అన్నారు మంత్రి హరీష్ రావు. కాగా టిఆర్ఎస్ అభ్యర్థి గాగేళ్లు శ్రీను ను సిఎం కెసిఆర్ ప్రకటించిన సంగతి తెల్సిందే.