పాడైన కేబుల్స్ పడేయకండి.. ఇలా యూజ్ చేస్తే సరి...!
మీ దగ్గరున్న ఓల్డ్ కేబుల్స్‌ను యూజ్ చేసుకుని స్మాల్ సైజు బుట్టను తయారు చేసుకోవచ్చు తెలుసా? ఎలాగంటే కేబుల్ నుంచి వైర్లను మొత్తం తీసి లోపల క్లాత్ రౌండ్‌గా చేసి బుట్టగా అల్లుకోవచ్చు. ఈ బుట్టకు పెయింటింగ్స్ కనుక వేస్తే ఇవి ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వైర్లు సాధారణంగా చాలా బలంగా ఉంటాయి. ఇక వాటితో చేసిన బుట్టలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
ఈ బుట్టను చిన్న చిన్న వస్తువుల్ని వేసే బాక్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. చిల్డ్రన్స్‌కు సంబంధించిన ఐటమ్స్ రబ్బర్స్, పెన్నులు, పెన్సిల్స్ ఇతరాలు ఈ బుట్టలో వేసుకోవచ్చు. ఇకపోతే ఈ బుట్టలు చిన్నపిల్లలకు నచ్చుతాయి కూడా. చార్జర్ కేబుల్‌ను ముక్కలుగా చేసి వాటితో ఏదైనా బర్డ్ షేప్‌లోకి తీసుకురావచ్చు. కేబుల్స్ గుండ్రంగా చుట్టినా కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రౌండ్ షేప్‌లో కేబుల్స్‌ను చుట్టి అందులో అట్టముక్కలు, దూది, వెట్ క్లాత్స్ ఇతరాలు వేసి పక్షి గూడులాగా కూడా మనం మార్చుకోవచ్చు. అందులో గింజలు వేయడం ద్వారా పక్షులు అక్కడకు వస్తాయి. అలా వాటికి ఫుడ్‌ను మనం సప్లై చేయొచ్చు.