బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫాలోయింగా మజాకా.. ఒక్క మాటతో స్టేడియం దద్ధరిల్లింది?

praveen
ప్రస్తుతం రాయలసీమలో మాస్ వైబ్రేషన్స్ మళ్లీ మొదలయ్యాయా అంటే అవును అనే టాక్ వినిపిస్తోంది... ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న మాస్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి పదవి వస్తుంది అని ఆయన అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూసారూ. అయితే  ఇక జగన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి పదవి ఇస్తానని అప్పట్లో సీఎం జగన్ హామీ కూడా ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట ఇటీవల జగన్ నిలబెట్టుకున్నారు.  మాస్ ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు సీఎం జగన్.




 దీంతో ఆయన అభిమానులు అందరూ ఆనందోత్సాహాల్లో మునిగి పోయారు అని చెప్పాలి. ఇక ఇటీవలే ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్..  మరికొంత మంది ఎమ్మెల్యేల సమక్షంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో  ప్రస్తుతం ఒకటి వైరల్ గా మారిపోయింది.  అయితే సాధారణంగా ఒక యువ నేత ఏదైనా పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఇక ఆ సమావేశానికి మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చినపుడు వారికి సంబంధించిన బ్యానర్లు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు ఇక మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సమయంలో కూడా కార్యకర్తలు అభిమానులు ఎక్కువగా జేజేలు కొడుతూ ఉంటారు.



 కానీ ఇక్కడ మాత్రం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫాలోయింగ్ చూసి అటు ఏకంగా మంత్రులు సైతం షాక్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  అప్పటివరకు ఇక మంత్రులు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ని ప్రభుత్వం నియమించింది అంటూ చెబుతున్న సందర్భంలో అక్కడ ఉన్నవారందరూ ఎంతో సైలెంట్ గానే ఉన్నారు. కానీ ప్రమాణ స్వీకారం చేసేందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మైక్ తీసుకుని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే నేను అనే ఒక్క పదం అనగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది.  అందరూ ఈలలు గోలలతో రెచ్చిపోయారు. దీంతో ఇక పక్కనే ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫాలోయింగ్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.  ఇక పై పైకి నవ్వుతూనే లోలోపల మాత్రం కాస్త ఫీల్ అయినట్లు గానే కనిపించింది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు ఒక లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: