మనకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఇకనుండి 112 నెంబర్ ఉపయోగంలోకి రానున్నది. అమెరికా దేశంలో 911 నెంబరును ఏవిధంగా అయితే ఉపయోగిస్తారో మన దేశ వ్యాప్తంగా ఒకే ఒక అత్యవసర నెంబర్ ఉండాలని 2 సంవత్సరాల క్రితం కేంద్ర సర్కారు నిర్ణయం చేసింది. దీనికి ప్రాధాన్యత కల్పించాలని కేంద్ర హోంశాఖ ఈ సంవత్సరం ప్రారంభంలో ఆదేశించడంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. ఒకటి లేదా రెండు నెలల్లో డయల్ 112 నెంబర్ పై ప్రజలకు అవగాహన కల్పించడానికి పోలీస్ శాఖ ప్రణాళిక సిద్ధంగా ఉంచింది.
మరో రెండు నెలల వరకు పాత నెంబరే వినియోగంలో ఉంటుంది. తర్వాత 100కు చేసిన 112 కు కాలు వెళ్లేలా అనుసంధానం చేస్తారు. ఈ నెల చివరి నుంచి వారం రోజుల లోపల 112కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖ మరియు అధికారులు, కంట్రోల్ రూమ్ కు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ డయల్ 112 పై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాలు ఉపయోగించాలని, అలాగే ట్రాఫిక్ కుడళ్ళ మధ్య సూచిక బోర్డులపై ఈ ప్రచారం బొమ్మలు వేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో ఎవరైనా డయల్ హండ్రెడ్ నెంబర్ కు కాల్ చేస్తే 10 నిమిషాలలో అత్యవసర బృందం సంఘటనా స్థలానికి చేరుకు పోతుంది. ఈ యొక్క సమయాన్ని పట్టణ ప్రాంతాలలో ఎనిమిది నిమిషాలకు తగ్గించనున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఈ సంవత్సరం ప్రారంభం నుంచే డయల్ 112 నెంబర్ పై ప్రచారాన్ని ప్రారంభించారు. వందల మంది ఒకే సారి ఫోన్ చేసినా స్వీకరించేలా ఒక ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాయి.
దీనిపై ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించింది. అమెరికా తరహాలో దేశవ్యాప్తంగా ఒకే నెంబర్ తేవడం ద్వారా సమస్యలు తొందరగా పరిష్కారమవుతాయని, ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని, కేంద్ర ప్రభుత్వం తెలిపింది. త్వరలో ఈ యొక్క నెంబర్ ను ప్రతి ఒక మారుమూల గ్రామానికి కూడా తెలిసేలా అవగాహన కల్పించాలని, దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో ఈ నెంబర్ను ప్రతి రాష్ట్రంలో అమలు పరచాలని కోరింది. ఈ నెంబర్ ను ఉపయోగించడం ద్వారా అంతకుముందు కంటే ఎక్కువగా పోలీసులు స్పందిస్తారని తెలియజేసింది.