బిజేపి ఎంపి ఫ్యామిలీ తో రేవంత్ కు కొత్త టెన్షన్?

Veldandi Saikiran
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి... తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ పై తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అటు అధికార పార్టీ పై విమర్శలు చేస్తూనే పార్టీ అభివృద్ధి పై కూడా రేవంత్రెడ్డి దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే చాలామంది నాయకులను కలుస్తూ.. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇటీవల కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సంజయ్... రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో  కాంగ్రెస్ పార్టీలో లో అసంతృప్తి వర్గాలు ఒక్కసారిగా బయట పడ్డాయి. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


 తమకు చెప్పకుండా నిజామాబాద్ నాయకులను చేర్చుకోవడం ఏంటని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఈ నేపథ్యంలోనే అయితే నిన్న జరిగిన పిసిసి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చేరికల పై వాడి వేడిగా చర్చ జరిగింది.  డీ. శ్రీనివాస్  తో పార్టీ కి నష్టం జరిగితే .. మళ్లీ ఆయన కొడుకును పార్టీలోకి పిలవడం ఏంటన్న నిజామాబాద్ నాయకులు రేవంత్ రెడ్డి పై సీరియస్ అయినట్లు సమాచారం అందుతోంది.   నాయకులు పార్టీ లోకి వస్తే.. లాభం ఉండాలి కానీ.. నష్టం ఉండేలా నిర్ణయాలు తీసుకోవద్దనీ సూచనలు చేసినట్లు సమాచారం. డీ. శ్రీనివాస్  అధికార టీఆర్ఎస్ పార్టీ లో హ్యాపీ గా ఉన్నాడు.. ఆయన కొడుకు బీజేపీ ఎంపి అరవింద్ కూడా పదవి ఉంది...ఇప్పుడు  సంజయ్ నీ తీసుకువచ్చి మనం మోయాలా..? అని గుర్రుగా ఉన్నారట.


   చిత్తు... పత్తు... రెండు ఆ కుటుంబం కే అన్నట్టు ఉంది పరిస్థితి ఉందని వర్కింగ్ ప్రెసిడెంట్  జగ్గారెడ్డి అభిప్రాయ పడ్డారు.  అయితే దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి స్పందిస్తూ..   కలుస్తా అంటే పిలిచానని...అందులో తన తప్పేం లేదని పేర్కొన్నారని సమాచరం.  పార్టీలో చేరిక ల కోసం టీం నీ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సలహాలు ఇచ్చారని తెలుస్తోంది. అలాగే.. పార్టీ కార్యకర్తలకు అండగా లీగల్ సపోర్ట్ కోసం ఓ కమిటీ వేయాలని..   కార్యకర్తలపై కేసులు గురించి లీగల్ కమిటీ పర్యవేక్షణ చేయాలని నిర్ణయించారు.   త్వరలో గాంధీ భవన్ లో కాల్ సెంటర్ ఏర్పాటు కూడా చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: