
అన్ని వేరియంట్లకు ఒక్కటే వ్యాక్సిన్.. ఏదో తెలుసా?
ఇక అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ పోరాటంలో వ్యాక్సిన్ ఎంతో కీలకమని అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీకా తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇక ప్రస్తుతం అత్యవసర వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్లను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటాయి అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. దీనిపై అటు పరిశోధనలు కూడా మొదలుపెట్టారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే పరిశోధనల్లో వెల్లడైన విషయాలను పరస్పరం ప్రకటిస్తూనే ఉన్నారు.
అయితే ఇటీవలే రష్యా శాస్త్రవేత్తలు తమ దేశ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. స్పుత్నిక్ వి డెల్టా తో పాటు ఇతర కరోనా వేరియంట్ పైన కూడా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని రష్యా శాస్త్రవేత్తలు చెప్పారు. ఇటీవలే రెండు డోసులు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తీసుకున్నవారి నుంచి రక్తనమూనాలను సేకరించి పరిశోధనలు జరిపామూ అంటూ తెలిపారు. ఆల్ఫా బీటా గామా డెల్టా వేరియంట్ ల తో పాటు మాస్కోలో ఇటీవలే వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ పై కూడా సమర్ధవంతంగా పని చేస్తోందని తెలిపారు. రోగనిరోధకశక్తి ప్రతి స్పందనను కలిగిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.