టీచరే కీచకుడయ్యాడు.. బాలికపై కన్నేసి?
నేటి సభ్య సమాజంలో మహిళలు గా పుట్టి పాపం చేశామేమో అని బాధ పడే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కడో ఓ చోట మహిళలపై కామాంధులు విరుచుకుపడి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్ కీచకుడిగా మారిపోయాడు. దారుణ ఘటన ఏపీ లోని చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మదనపల్లిలో ఉపాధ్యాయుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇక బాలికలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ దినిష్ మాయ మాటలతో నమ్మించి బాలికను లొంగదీసుకున్నాడు. కొన్ని రోజుల నుంచి బాలికపై గుట్టుచప్పుడు కాకుండా అత్యాచారం చేస్తున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తావు అంటూ బాలికను బెదిరింపులకు సైతం దిగాడు. ఎన్నో రోజుల పాటు తనపై జరుగుతున్న ఘోరాన్ని ఎవరికి చెప్పుకోలేక తనలోతానే కుమిలిపోయింది బాలిక. ఇక బాలిక ప్రవర్తనలో మార్పులు రావడంతో తల్లిదండ్రులు మందలించి అడిగారు. దీంతో అసలు విషయం బయటపెట్టింది. ఇక బాలిక చెప్పిన విషయం తో షాక్ అయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.