బాస్మతి బియ్యం కోసం భారత్-పాక్ మధ్య గొడవ?
అయితే ఇప్పటి వరకు వివిధ రకాల కారణాలతో భారత్-పాకిస్తాన్ మధ్య గొడవ జరగడం లాంటి ఘటనలు చూశాం. కానీ ఇక్కడ జరిగిన ఘటన మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా బాస్మతి బియ్యం కారణంగా పాకిస్తాన్ భారత్ మధ్య ఇటీవల గొడవ జరిగింది అంటే ఎవరైనా నమ్ముతారా. ఇలా చెప్తే కోపంగా ఒక చూపు చూసి ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోతారు. కానీ ఇది నిజమే బాస్మతి బియ్యం కారణంగా పాకిస్తాన్ భారత్ మధ్య గొడవకు దారితీసింది. ఇక బిర్యానీ కోసం ఉపయోగించే బాస్మతి బియ్యం రెండు దేశాల మధ్య గొడవకు కారణం కావడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.
యూరోపియన్ యూనియన్ దేశాలలో బాస్మతి బియ్యం పంపిణీ హక్కుల కోసం భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల గొడవ జరిగినట్లు తెలుస్తోంది. బాస్మతి రైస్ యూరోపియన్ యూనియన్లో పంపిణీ చేసేందుకు పూర్తి హక్కులు తమకే చెందేలా ఇటీవల భారత ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఈ ఒప్పందంపై అటు పాకిస్థాన్ మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే ఐరాస లెక్కల ప్రకారం బాస్మతి బియ్యాన్ని భారత్ ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఎగుమతి చేస్తుంది.. కాగా బాస్మతి రైస్ ఎగుమతిలో అటు పాకిస్థాన్ 4వ స్థానంలో కొనసాగుతోంది.