ఏ వ్యాక్సిన్ తో.. యాంటీబాడీలు ఎక్కువొస్తాయో తెలుసా?
ప్రతి ఒకరికి టీక అందించి అందరిలో యాంటీబాడీలను అభివృద్ధి చేయడమే ప్రస్తుతం వాక్సినేషన్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. అయితే రెండు రకాల టీకాలు ప్రస్తుతం వినియోగంలో ఉన్న నేపథ్యంలో ఏం టీకా ద్వారా ఎక్కువగా యాంటీబాడీలు వస్తాయి అనే విషయం పై ఎవరిలో సరైన క్లారిటీ లేదు. తాజాగా ఇటీవలి వైద్య నిపుణులు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. కోవాక్సిన్ అన్నా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు.
ఇక రెండు వ్యాక్సిన్ లు వేసుకున్న వారిపై అధ్యయనం జరిపి ఈ విషయాన్ని తెలియజేసినట్లు పరిశోధకులు చెప్పుకొచ్చారు. ఫ్రీప్రింట్ రూపంలో ఉన్న మాత్రమే అందుబాటులో ఉన్న అధ్యయనాన్ని ఇంకా పూర్తిస్థాయిలో ఇంకా లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో అత్యవసర వినియోగంలో ఉన్న రెండు టీకాల ద్వారా యాంటీబాడీలు భారీ మొత్తంలోనే ప్రేరేపితం అవుతున్నాయి అని చెబుతున్నారు నిపుణులు.. కానీ కోవాక్సిన్ తో పోల్చి చూస్తే మాత్రం వ్యాక్సిన్ వేసుకునే వారిలో మరింత ఎక్కువగా యాంటీబాడీలు కనిపిస్తున్నారు గుర్తించినట్లు తెలిపారు.
ఈ అధ్యయనంలో ఏకంగా 552 మంది వైద్య సిబ్బంది పై పరీక్షలు నిర్వహించి నివేదిక అందించినట్లు తెలుస్తుంది . కోవిషీల్డ్ తీసుకున్న 425 సిబ్బందిలో సెరోపాజిటివిటీ రేటు 98.1 గా ఉన్నట్లు గుర్తించారు, అలాగే కొవ్యాక్సిన్ తీసుకున్న90 మందిలో సెరోపాజిటివిటీ రేటు 80.0 శాతంగా ఉందని తేలింది. అంతేకాకుండా..యాంటీ స్పైక్(స్పైక్ ప్రోటీన్ నిర్వీర్యం చేసే)యాంటీబాడీల మీడియన్ స్థాయి(ఐక్యూఆర్) కోవీషీల్డ్ విషయంలో 127 ఏయూ/ఎమ్మెల్ గా ఉండగా.. కొవ్యాన్సిన్ విషయంలో మాత్రం 53గా నమోదైంది. అయితే ఇలా రెండు వ్యాక్సిన్ ల ద్వారా విడుదలవుతున్న ఈ యాంటీబాడీల లో కాస్త వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఈ రెండూ కూడా అందరిపై సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి అన్న విషయాలు చెప్పుకొచ్చారు వైద్య నిపుణులు.