రోడ్డుమీద పులి.. జంకుతున్న జ‌నం.. విష‌య‌మేందంటే

praveen
పులిని మ‌నం సిన‌మాలు, టీవీల్లో చూస్తేనే జ‌డుసుకుంటాం. అలాంటిది నిజంగా చూస్తే ఇంకేమైనా ఉందా. ఇప్ప‌టికే పుల‌ల‌కు సంబంధించిన వీడియోలు ఎన్నో మ‌న‌ల్ని వ‌ణికించాయి. కొన్నియితే నిజంగానే మ‌నుషుల్ని చంపేసిన ఘ‌ట‌న‌లు మ‌న‌కు పీడ‌క‌ల‌లుగా మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు ఓ పులి రోడ్డుమీద‌కు వ‌చ్చేసింది. దీంతో దాన్ని చూస‌న వాహ‌న‌దారుల గుండెలు ఝ‌ల్లుమంటున్నాయి. అయితే దానికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది.
అయితే రోడ్డు మీద కూర్చున్న పులి చాలాసేపు ఎలాంటి కదలిక లేకుండా అలాగే ఉండిపోవ‌డంతో చాలామందికి అనుమానం వ‌చ్చింది. దీంతో వారు ధైర్యం చేసి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. కొంద‌రు దగ్గరకు వెల్లి చూడ‌గా అస‌లు విష‌యం తెలిసింది. అది పులి కాదు బొమ్మ అని అంద‌రికీ అర్థం కావ‌డంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వీడియో ఘ‌ట‌న ఎక్క‌డో జ‌రిగింది అనుకునేరు మ‌న తెలంగాణ‌లోనే. అది పులి కాదు బొమ్మ అని నిర్ధారించుకుని వాహనదారులు వెళ్లిపోతున్నారు. నిజామాబాద్ శివారులోని మాధవ నగర్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నడి రోడ్డు మీద కొంద‌రు ఉంచిన ఓ పులి బొమ్మ వాహన దారులను, జనాలను విప‌రీతంగా ఆకట్టుకుంటుంది. నిజామాబాద్ మీదుగా హైదారాబాద్ వెళ్లే ప్రధాన రోడ్డుకు అనుకుని ఉంది మాధవ నగర్ గ్రామం. అక్కడ కంకర రాళ్ళు కనిపిస్తున్న చోట ఓ విద్యుత్ స్తంభం ప్ర‌మాద‌క‌రంగా ఉండేది.
ఇంత‌కు ముందు అయితే విద్యుత్ సిబ్బంది ఆ స్తంభాన్ని తొలగించ‌డంతో ఇబ్బంది త‌ప్పింది. కానీ ఆ స్థంబం ప్లేసులో గుంత వద్ద కంకర కూడా వేశారు. కంక‌ర‌మీదుగా వెళ్లే ప్రయాణీకులు వాహనదారులకు ఇబ్బంది కావద్దని గ్రామ‌స్తులు ఎవరో అక్కడ పులి బొమ్మ పెట్టార‌ని తెలుస్తోంది. దీన్ని చూసిన జ‌నాలు ఆగి దూరంగా వెళ్తున్నారు. గ్రామ‌స్తులు మంచి ప‌నే చేశారు. కానీ అధికారులు రోడ్డుపై తారు వేసేస్తే బాగుంటుంది అంతా కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: