పెళ్లి చేసుకోబోతున్నారా.. తహసీల్దార్ల ఆశీర్వాదం తప్పనిసరి?
ఈ నేపథ్యం లో గత ఏడాది పెళ్ళిళ్ళు శుభకార్యాల పై ఆంక్షలు విధించినటు గానే ఈసారి కూడా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి ఆంక్షలను అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తక్కువమంది బంధుమిత్రుల తో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఆంక్షలు విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా తహసిల్దార్ పర్మిషన్ తీసుకోవాలి అంటూ స్పష్టం చేసింది.
జన సమూహాల నుండి నియంత్రించేందుకు 30 లేదా 50 మంది వరకు మాత్రమే పెళ్లికి హాజరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక పెళ్లి కోసం ముందు గానే వధూవరులకు సంబంధించిన ఆధార్ కార్డులు పెళ్లి పత్రిక సమర్పించి అనుమతి పొందాల్సి ఉంటుంది. వీఆర్వో అనుమతి ప్రకారమే శుభకార్యాలను నిర్వహించుకోవాలి ఉంటుంది. ఇక మిగితా శుభకార్యాలకు కూడా ఇలాంటి ఆంక్షలు అమలు లోకి తీసుకు వచ్చేందుకు అధికారులు భావిస్తున్నారు . అయితే ఇలా జన సమూహాలను లేకుండా చేయడం వల్ల కరోనా వైరస్ కేసులు ఎంతో సమర్థవంతం గా కట్టడి చేయవచ్చు అని అధికారులు భావిస్తున్నారు.