ఓట్లు వచ్చాయ్.. కానీ సీట్లు రాలే.?

praveen
ఇటీవలే అస్సాంలో ఎంతో ప్రతిష్టాత్మకం గా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.  అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఘన విజయాన్ని సాధించి త్వరలో అధికారాన్ని చేపట్టబోతుంది. అయితే అటు కాంగ్రెస్ పార్టీ సీట్లు సాధించినప్పటికీ అటు అధికారాన్ని చేపట్టేంత మెజార్టీ మాత్రం సాధించ  లేకపోయింది.  దీంతో అటు అసోంలో కాషాయ జెండా ఎగిరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఏఏ ప్రభావం అసోంలో ఎంతగానో ఉంది అని చెప్పాలి.

 స్థానికులకు తాము అండగా ఉంటామని.. బయటి నుంచి వచ్చిన వాళ్లకు ఓటు హక్కు తొలగిస్తాము అంటూ ఎన్డీఏ తెలిపింది.  అయితే సిఏఏ మాత్రం అక్కడి ప్రజలు అందరినీ ఎంతగానో ఆలోచనలో పడేసింది. ఈ క్రమంలోనే అక్కడ స్థానిక ప్రజలు కూడా నిరసనలు ఆందోళనలు మొదలుపెట్టారు. ఎందుకంటే మొదట్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని ఆదరించడం బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత స్థానికులు సంఖ్య తగ్గిపోవడం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పెరిగిపోవడం వారే రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం లాంటి పరిస్థితి ఏర్పడడంతో స్థానిక ప్రజలందరిలో కూడా మద్దతు పెరిగింది.

 ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లో భాగంగా ఎన్డీఏ 73 సీట్లు గెలుచుకుని ఇక అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది అయితే ఎన్డీఏ  ఎక్కువ సీట్లు గెలిచినప్పటికీ  39 శాతం ఓటింగ్ మాత్రమే సాధించినట్లు  అర్థమవుతుంది  అయితే యూపీఏకి అటు 50 కి పైగా సీట్లు వస్తే ఇక ఓటింగ్ శాతం మాత్రం 42.36 శాతం పెరిగింది. ఇతరులు 17 శాతానికి పైగా ఓట్లు సాధించారు.  ఇలా ఒక రకంగా గెలిచింది బిజెపి అయినప్పటికీ అక్కడ స్థానికేతరులు ఎక్కువగా సీఏఏ కు వ్యతిరేకంగా గళం వినిపించిన పార్టీలకు ఓటింగ్ శాతం పెరిగింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: