కరోనా పుట్టుక అక్కడి నుండేనట.. డబ్ల్యూహెచ్వో కీలక వ్యాఖ్యలు..?
ఈ క్రమంలోనే కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు సిద్ధమైన శాస్త్రవేత్తలు అసలు ఈ వైరస్కు మూలాలు ఏమిటి తెలుసుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ చైనా మాత్రం శాస్త్రవేత్తలను తమ దేశంలోకి అనుమతించకపోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలను సైతం చైనా అనుమతించ లేదు. కానీ ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు చైనాలో కరోనా గురించి కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు పరిశోధనలు చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా కరోనా వైరస్ యొక్క పుట్టుక ఎక్కడ నుంచి ప్రారంభమైంది అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.
అయితే ఇటీవలే కరోనా వైరస్ మూలలకు సంబంధించిన మొదటి వ్యాప్తి ఎక్కడి నుంచి జరిగింది అనే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. చైనాలోని వైల్డ్లైఫ్ ఫామ్స్ కరోనా వైరస్ మూలాలకు కారణం అయి ఉండవచ్చు అని డబ్ల్యుహెచ్వో బావిస్తుంది. చైనాలో పేదరికాన్ని తగ్గించే ప్రక్రియలో భాగంగా కొన్నేళ్లుగా అక్కడి గ్రామీణ ప్రాంతాలలో వన్యప్రాణుల పెంపకాన్ని చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలా వన్యప్రాణుల పెంపకంలో భాగంగా పంగోలిన్లు ఎలుకలు పందికొక్కుల అక్కడ పెంచుతూ ఉంటారు. అయితే వీటి నుంచి మొదటగా మనుషులకు వైరస్ సోకి ఉండవచ్చునని డబ్ల్యుహెచ్వో భావిస్తోంది. అయితే గత ఏడాది వైరస్ వెలుగులోకి రాగానే చైనా ప్రభుత్వం వీటిని మూసి వేయడం గమనార్హం.