ఆధార్ + ఓటర్ ఐడి.. అబ్బబ్బా ఏం ఐడియా మోడీజీ..?

praveen
కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఆధార్ కార్డ్ అనే ఒక సరికొత్త కాన్సెప్ట్ ని తెర మీదికి తెచ్చింది.  దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. ఇక ప్రస్తుతం ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించాలి అన్న కూడా ఆధార్ కార్డు తప్పనిసరి అన్న విషయం తెలిసింది.  అన్ని రకాల పత్రాలకు ఆధార్ కార్డు అనుసంధానం చేయడం తప్పనిసరిగా మార్చేసింది కేంద్రం. ఇలా రోజురోజుకు ఆధార్ కార్డు ఆవశ్యకతను పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం  .


 అయితే ఇప్పటి వరకు ఓటర్ ఐడి తో ఆధార్ అనుసంధానం ప్రక్రియ మాత్రం జరగలేదు అనే విషయం తెలిసిందే.ఇలా జరగకపోవడం వల్ల ఎంతోమంది ఇక ఎన్నో ప్రాంతాలలో ఓట్లు కలిగి ఉండడం.. ఒక్కసారి ఓటు హక్కును వినియోగించుకోవడం కాదు లెక్కలేనన్ని సార్లు ఓటు హక్కు వినియోగించుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల అటు ఎన్నో మోసాలు కూడా తెర మీదికి వస్తున్నాయి.అప్పుడప్పుడు ఇలాంటి దొంగ ఓట్లు కి సంబంధించిన అంశాలు కూడా తెర మీదకి వస్తున్న సందర్భంగా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇలాంటివి ఇక భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇలా ఒక వ్యక్తి వివిధ ప్రాంతాల్లో ఓట్ కలిగి ఉండకుండా చేసేందుకు ఇటీవల ఒక సరికొత్త కార్యాచరణ మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఓటర్ ఐడి తో ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఓటర్ ఐడి తో ఆధార్ కార్డు అనుసంధానం చేయడం ద్వారా ఒక వ్యక్తి కేవలం ఒకే చోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. తద్వారా వివిధ ప్రాంతాలలో ఒకే వ్యక్తి ఓటు వేసేందుకు అవకాశం లేకుండా పోతుందని ఇది ఎంతో గొప్ప ఆలోచన అని కేంద్ర ప్రభుత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: