యూట్యూబ్ లో చూసి పిల్లల పై ప్రయోగాలు చేశాడు.. చివరికి..?
ప్రస్తుతం యూట్యూబ్లో అన్ని రకాల సమాచారాలు అందుబాటులో ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కావాల్సిన సమాచారాన్ని తెలియ చేయడమే కాదు ఇక ఆ అంశం గురించి క్లుప్తంగా వివరించే వీడియోలు కూడా ప్రస్తుతం యూట్యూబ్లో లభిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది వివిధ రకాల సమాచారాన్ని పొందుతున్నారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ కొంత మంది మాత్రం యూట్యూబ్ లో ఉన్న సమాచారాన్ని చెడు పనుల కోసం ఉపయోగిస్తున్నారు. గతంలో కొంతమంది యూట్యూబ్ లో దొంగతనం చేయడం ఎలా అని చూసి నేర్చుకుని చివరికి దొంగతనాలకు పాల్పడిన ప్లాన్ తారుమారు అయ్యి కటకటాల పాలైన ఘటన కూడా తెరమీదికి వచ్చింది అనే విషయం తెలిసిందే.
ఇక మరికొంతమంది యూట్యూబ్ లో చూసి వింత ప్రయోగాలు కూడా చేసిన వారు ఉన్నారు. ఇక ఇటీవల ఓ ప్రబుద్ధుడు ఇలాంటి తరహాలోనే ఆలోచించాడు. యూట్యూబ్ లో చూసి పిల్లల పై ప్రయోగాలు చేశాడు. జ్ఞాపకశక్తి మెరుగ్గా అయ్యేందుకు సెలైన్ ఎక్కించుకోవాలి అని.. సూచించాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. అయితే 20 ఏళ్ల సందీప్ అనే వ్యక్తి పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే సెలైన్ ఎక్కించు కోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని తాను యూట్యూబ్లో చూశాను అంటూపిల్లలకు చెప్పాడు ఈ క్రమంలోనే ఒక పిల్లాడు ఇంటికి వెళ్లి సెలైన్ ఎక్కించు కుంటూ ఉండగా తల్లిదండ్రులు చూసి అడగడంతో అసలు విషయం చెప్పేశాడు. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు చెప్పడంతో కటకటాలపాలయ్యాడు సందీప్.