సొంత తమ్ముడినే చంపిన అన్న.. కారణం తెలిసి అందరు షాక్..?

praveen
ఈ మధ్య కాలంలో బంధాలకు బంధుత్వాలకు అసలు విలువ ఇవ్వడం లేదు మనుషులు. రక్తం  పంచుకుని పుట్టిన వారికి సైతం విలువ ఇవ్వకుండా దారుణం గా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. చిన్న చిన్న కారణాలకే ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులు దారుణంగా ప్రాణాలు తీస్తున్నారు.  ఈ మధ్య కాలంలో ఇలా సాటి మనుషుల విషయంలో కాస్త అయినా జాలి దయ లేకుండా అత్యంత పాశవికంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే.  ఇక్కడా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

 సొంత అన్న తమ్ముడుని  దారుణంగా హతమార్చాడు.  అది కూడా తండ్రి చనిపోయిన కొన్ని రోజులలోనే అన్న ఈ దారుణానికి పాల్పడటంతో  స్థానికంగా కలకలం సృష్టించింది. కర్నూలు జిల్లాలో  ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముడు ని దారుణంగా హతమార్చడఏ కాదు డెడ్ బాడీ ని తీసుకెళ్లి ఇంటి దగ్గర పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మూడు రోజుల క్రితమే తండ్రి అనారోగ్యంతో చనిపోగా తండ్రి చిన్న కర్మ విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేంత వరకు వెళ్ళింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 అయితే తండ్రి చనిపోయిన కొన్ని రోజుల్లోనే తమ్ముడు ని హత్య చేయడానికి గల కారణం ఏంటి అనే దానిపై వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  అంతే కాకుండా కుటుంబ సభ్యులు బంధువులను కూడా ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల క్రితం చనిపోవడంతో విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు..  తమ్ముడు కూడా చనిపోవడంతో విషాదంలో మునిగిపోయారు. తండ్రి కొడుకులు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: