సముద్రం నీటి లోపల పెళ్లితో ఒక్కటయిన జంట.. వైరల్ వీడియో..?
ఇక ఆ తర్వాత పెళ్లి వేడుకకు వచ్చిన బంధు మిత్రులందరూ కూడా నూతన వధూవరులకు ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు. ఇలా సర్వసాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే ప్రతి పెళ్లి లో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల జంట మాత్రం కొత్తగా ఆలోచించింది. హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ పెళ్లి మండపం లో కాకుండా వినూత్నంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే అందరూ ఆశ్చర్య పోయే విధంగా పెళ్లి చేసుకుంది ఇక్కడ ఓ జంట.
చెన్నైకి చెందిన శ్వేత, చిన్నదురై అనే ఇద్దరు యువతీ యువకులు సముద్రం నీటి లోపల హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అడ్వెంచర్ డైవ్ సెంటర్ సహాయంతో సముద్ర తీరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో 60 అడుగుల నీటి లోపల.. హిందు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ అడ్వెంచర్ పెళ్లి కోసం ఏకంగా మూడు రోజులపాటు ట్రైనింగ్ తీసుకున్నారు ఈ జంట. అంతేకాదు పెళ్లి ఫీల్ రావడం కోసం నీటిలో అరటి తోరణాలు కూడా ఏర్పాటు చేశారు.