రజనీకాంత్ పార్టీ తరపున సీఎం అభ్యర్థి ఈయనేనా...?

VAMSI
తమిళనాడు రాజకీయాలు సినీ తారల ప్రవేశంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. గొప్ప నటులు అయిన రజనీకాంత్ మరియు కమల హాసన్ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాడు లో ఇంతకుముందు నుండే ఉన్న పార్టీలకన్నా ఇప్పుడు వీరిద్దరిపైనే అందరి చూపు నెలకొంది. ఇప్పటికే ఎంతోమంది సినీ నటులు రాజకీయాల్లో ప్రవేశించి నిలదొక్కుకోలేక వెనక్కి తగ్గిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రజనీకాంత్ పై ప్రజలకు విశ్వాసం ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని రానున్న అసెంబ్లీ ఎన్నికలలో రజనీకాంత్ పార్టీ పోటీ చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
కానీ ఇప్పటివరకు పార్టీ పేరును మరియు పార్టీ కార్యాచరణను ప్రకటించకపోవడం ఆందోళనకరం. రాజకీయాలకు కొత్త కాబట్టి ఎక్కువ సమయాన్ని తీనుకుంటున్నారు రజనీ.. ఇదంతా ఇలా ఉంటే...మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు చేసుకుంటున్నాయి. రజనీకాంత్ కూడా ఈ నెలాఖరులో పార్టీ ని అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే మరో నటుడు కమల్ హాసన్ ఇప్పుడు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంచీపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రజనీకాంత్ పార్టీ ని స్థాపించినా సీఎం అభ్యర్థిగా పోటీ చేయనని చెప్పడంతో, సీఎం అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు మక్కల్ నీది మయ్యం  పార్టీ అధ్యక్షుడు కమల్,  రజనీకాంత్ కోరితే అసెంబ్లీ ఎన్నికలలో సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు.
 ఈ సందర్భంగా ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసారు కమల్.. డబ్బులు పంచేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ప్రజల సమస్యలపై మాత్రం ఎందుకు వెనకడుగువేస్తోందని, రేషన్ కార్డు దారులందరికీ 2500 రూపాయలు ఇస్తున్నారని...తాను డబ్బులు కన్నా ప్రజలను నమ్ముతానని పేర్కొన్నారు...నేను కనుక అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు పెద్ద పీట వేస్తానని చెప్పారు. మరి రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా   జరగనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: