తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లు కాలేజీలు తెరిచేది అప్పుడే..?

praveen
కరోన  వైరస్ కారణంగా విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి మూతపడిన విద్యాసంస్థలు ఇప్పటికి కూడా పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అన్లాక్ మార్గదర్శకాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థలను తెరుచుకునేందుకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో విద్యాసంస్థలను తెరిచేందుకు ముందుకు వచ్చినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వెనుకడుగు వేయక తప్పలేదు అనే చెప్పాలి. అయితే ఇప్పటికీ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో విద్యార్థులకు విద్యా సంవత్సరం వృధా అయ్యే అవకాశం ఉంది.

 ఈ క్రమంలోనే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం విద్యాసంస్థలను తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను తెరిచి కఠిన నిబంధనల మధ్య విద్యార్థులకు విద్యా బోధన చేస్తుంది.  ఇక అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు విద్యాసంస్థలు తెరుస్తారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది.ఇక ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో వరుసగా దుబ్బాక ఉప ఎన్నిక... అటు వెంటనే జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు స్కూళ్లు కాలేజీలు తెరవడం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది అనే విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే తెలంగాణలో పాఠశాలల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. సీఎం కేసీఆర్ ఓకే అంటే జనవరి 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు కాలేజీలు తెరవడానికి విద్యాశాఖ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 2021 జనవరి 4 నుంచి స్కూళ్లు  కాలేజీలలో  విద్యాబోధన ప్రారంభించాలని యోచిస్తున్న తెలంగాణ విద్యాశాఖ మొదట తొమ్మిది పది ఇంటర్ తరగతులు ప్రారంభించి ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మిగతా తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. మూడు నెలలు విద్యా బోధన చేసిన వెంటనే వార్షిక పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది.  దీని గురించి విద్యాశాఖ మంత్రి కేసీఆర్కు ప్రతిపాదనలు పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: