భారత్ కి వెళ్తే బుద్ధి వచ్చిందా.. చైనా సంచలన వ్యాఖ్యలు..?

praveen
ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... భారత్ లోకి కంపెనీల ను ఆకర్షించడం లో సక్సెస్ అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే చైనా లో ఉన్నటువంటి ఐఫోన్ కంపెనీ కాస్త తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఈ క్రమంలోనే బెంగళూరు లో బ్రాంచ్ ప్రారంభించేందుకు ఐఫోన్ సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  పలు కార్మిక సంఘాలు ఐఫోన్ కంపెనీ పై దాడి చేయడంతో ఏకంగా యాభై రెండు కోట్ల నష్టం జరిగింది. ఈ ఘటన కాస్తా సంచలనంగా మారిపోయింది

 ఇలాంటి పరిణామాల నేపథ్యం లో ఇటీవల చైనా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారిపోయాయి అనే చెప్పాలి. చైనా నుంచి భారత్ వెళ్లడం కారణంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. చైనాలో కార్మిక చట్టాలు ఎంతో పటిష్టంగా ఉండటం వల్ల ఇక్కడ వ్యాపారం చేసుకోవడం ఎంతో సులభతరంగా మారింది... భారత్ లోకి వెళ్ళినందుకు తగిన శాస్తి జరిగింది అనుభవిస్తున్నారు అంటూ చైనా వ్యాఖ్యలు చేసింది. అయితే చైనా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం విశ్లేషకులు మాత్రం తీవ్రస్థాయిలో అహం వ్యక్తం చేస్తున్నారు.

 చైనాలో అసలు కార్మికులకు హక్కులే ఇవ్వకుండా  కార్మికులను బానిసలుగా మార్చుకుని కార్మికులకు ఎలాంటి హక్కులు ఇవ్వకుండా కార్మికులనూ  ఏడిపించకు తింటున్న  చైనా కార్మికులకు అన్ని హక్కులు కల్పించిన భారత్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. నిర్బంధ కార్మిక విధానాలను చైనాలో అమలు చేస్తూ... భారత్ లో అన్ని హక్కులు కలిగివున్న కార్మికుల గురించి మాట్లాడుతూ... చైనా కల్లబొల్లి మాటలు వల్లించడం హాస్యాస్పదం అని అంటున్నారు విశ్లేషకులు.ముందు మీ దేశం లో కార్మికుల గురించి చూసుకుని ఆ తర్వాత భారత్ కార్మికుల గురించి మాట్లాడుతూ బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: