ఎత్తైన పర్వతం మరింత ఎత్తు పెరిగింది..!

NAGARJUNA NAKKA
ప్రపంచంలో ఎత్తైన పర్వతం మరో మీటరు ఎత్తు పెరిగింది.  ఈ విషయాన్ని చైనా, నేపాల్ సంయుక్తంగా ప్రకటించాయి.  చైనా, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న  ఎవరెస్ట్ ఎత్తు 8848 మీటర్లు ఉన్నట్లు గతంలో ఆమోదించగా, ఇప్పుడు దాని ఎత్తు మరో 86 సెంటీమీటర్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించారు. శిఖరాన్ని కప్పిన మంచుతో కలిపి మౌంట్ ఎవరెస్ట్ హైట్‌ను లెక్కించారు.
పర్వతారోహకుల ఫస్ట్ ఆర్ ఫైనల్ టార్గెట్ మౌంట్ ఎవరెస్ట్. శిఖరం అంచున తమ దేశపు జండా పాతి ఫోటో తీసుకోవాలని ముచ్చట పడే వాళ్ల గురించి చెప్పాల్సిన అవసరంలేదు. ఈ పర్వతం ఎత్తు ప్రస్తుతం మరో మీటరు పెరిగింది. చైనా, నేపాల్ సర్వే శాఖలు ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలిచాయి. శిఖరం ఎత్తు 8848.86 మీటర్లని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తో కలిసి ప్రకటించడానికి సంతోషిస్తున్నాను అంటూ నేపాల్ అధ్యక్షురాలు సందేశం విడుదల చేశారు. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో సాగర్ మాత అని టిబెట్లో చోమోలుంగ్మ్ అని పిలుస్తారు.
మౌంట్ ఎవరెస్ట్‌ ఎత్తును కొలిచే పనిని, చైనా నేపాల్ బృందాలు విడివిడిగా చేపట్టాయి. ఇప్పటి వరకు చైనా.. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు బ్రిటిష్ కాలం నాటి సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన ఎత్తు కంటే 4 మీటర్ల తక్కువ అని చెబుతూ వచ్చింది. అయితే సర్వే ఆఫ్ ఇండియా కొలతలనే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించారు. నేపాల్ లో 2015లో వచ్చిన భారీ భూకంపం ప్రభావం శిఖరం పై పడిందని భావించడంతో 2017లో ఈ శిఖరం ఎత్తును కొలిచే పనిని నేపాల్ మొదలుపెట్టింది. మౌంట్ ఎవరెస్ట్ టిబెట్‌, నేపాల్‌లో ఉన్నా.. శిఖరాగ్రం మాత్రం నేపాల్‌లో ఉంది.
తంలో చాలా సార్లు దీనిని కొలిచినప్పటికీ నేపాల్ అధికారికంగా ఈ శిఖరం ఎత్తును కొలవడం ఇదే మొదటిసారి. ఇలాంటి సర్వేని చేయడానికి ముందు చైనా పూనుకుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడానికి 2019లో నేపాల్, చైనా దేశాల నేతలు ఒప్పందం చేసుకున్నారు. ఏడాది తర్వాత రెండు దేశాలు ఎవరెస్ట్ ఎత్తు గురించి అధికారిక ప్రకటన చేశాయి.
2019 వసంత కాలంలో ఇరు దేశాల సర్వేయర్లు ఎవరెస్ట్ శిఖరం పైకి చేరుకున్నారు. సాధారణంగా ఎవరెస్టును అధిరోహించడం కన్నా ఈ శిఖరాగ్రాన్ని చేరడం పూర్తిగా భిన్నం. ఎవరెస్టును ఎక్కే పర్వతారోహకులు చాలా మంది శిఖరం చేరుకునేటప్పటికి శారీరకంగా , మానసికంగా అలిసిపోతారు.  శిఖరాగ్రం పైన జిపిఎస్ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం నేపాల్లో వివిధ ప్రాంతాలలో అమర్చిన మరో 8 గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలతో అనుసంధానించారు. ఈ జిపిఎస్ ద్వారా శిఖరాగ్రం నుంచి భూమధ్య భాగానికి ఉన్న దూరాన్ని అటూఇటుగా ఒక సెంటీమీటర్ తేడాతో కొలవ వచ్చు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ మొత్తంలో సమాచారం సేకరించడానికి సర్వే బృందం అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం గడిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: