డార్లింగ్ ని చూస్తుంటే అద్భుతంగా అనిపించింది.. కల్కి మూవీ పై కామెంట్స్‌ చేసిన కేజిఎఫ్ హీరో..!

lakhmi saranya
ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటించిన కల్కి మూవీ నిన్న అనగా జూన్ 27వ తారీఖున రిలీజ్ అయింది. ఇక తొలి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ రాబట్టడం విశేషం. 191 కోట్ల కలెక్షన్స్ చేసిన ఈ సినిమాపై ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ గురించి ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ ఏ వినిపిస్తుంది.
సుమారు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఊహించినట్లుగానే బ్లాక్ బస్టర్ సాధించింది. తొలి షో నుంచే వచ్చిన పాజిటివ్ టాక్ మేకర్స్ లో ఉత్సాహాన్ని నెలకొల్పింది. ఇక దీనికి తోడు అన్ని ఇండస్ట్రీలా ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తాజాగా శుక్రవారం అనగా నేడు కేజిఎఫ్ హీరో యష్ కూడా స్పందించాడు. " విజువల్ గా ఓ అద్భుతాన్ని క్రియేట్ చేసిన కల్కి టీంకు శుభాకాంక్షలు. మరింత క్రియేటివ్ ద స్టోరీలు చెప్పడానికి ఈ సినిమా దారి చూపుతుంది.
మరింత మంది ఓ పెద్ద అడుగు వేసేలా నాగ్ అశ్విన్ అండ్ వైజయంతి మూవీస్ విజన్ స్ఫూర్తిగా నిలవనుంది. డార్లింగ్ ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్ సార్, కమల్ హాసన్ సార్, దీపికా పదుకొనే ఇతర అతిథి పాత్రలను కలిసి చూడటం ఎంతో అద్భుతమైన అనుభూతుని కలిగించింది. ఇది నిజంగా స్క్రీన్ ను మరింత ప్రకాశించేలా చేసింది " అంటూ పేర్కొన్నాడు యష్. ప్రెసెంట్ ఈనట్ వెయిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ట్వీట్ ని చూసిన కే జి ఎఫ్ హీరో అభిమానులు కల్తీ సినిమాని మా హీరోనే చూశాడు అంటే మేము తప్పనిసరిగా చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: