కల్కి2898AD: గూగుల్ లో కల్కి రికార్డుల మోత..!

Divya
తాజాగా విడుదలైన కల్కి మూవీ ఎవరు ఊహించని స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందింది.. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి కల్కి చిత్రానికి పాజిటివ్ టాక్ రానే వచ్చింది. అందుకు తగ్గట్టుగానే రిలీజ్ అయిన తర్వాత బుకింగ్స్ లో కూడా కల్కి చిత్రం హైప్ భారీగా పెరిగిపోయింది. మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ కూడా అదిరిపోయే విజువల్స్ తో ప్రేక్షకులను సైతం కట్టిపడేసేలా చేస్తోంది. కల్కి మూవీ కచ్చితంగా ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చే అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలబడుతుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.

భైరవ పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించారు. దీపికా పదుకొనే కల్కి కి జన్మనివ్వబోయే సుమతి పాత్రలో నటించింది. ప్రస్తుతం కల్కి సినిమాకి వస్తున్న ఆదరణబట్టి మొదటి రోజే రూ 180 కోట్ల రూపాయలకు సంపాదించింది.. ఈ సినిమా డిజిటల్ బుకింగ్స్ యాప్ లో కూడా ఏకంగా 9.3 రేటింగ్ తో నిలబడింది.. పేటీఎం యాప్ లో కూడా 96% ప్రేక్షకు అధారణ పొందిన చిత్రంగా పేరు సంపాదించింది..IMBD రేటింగ్ ప్రకారం 8.4 కలిగి ఉన్నది..

ఇక google లో అవుట్ ఆఫ్5కి 4.8 రేటింగ్ సంపాదించుకుంది కల్కి మూవీ.. దీన్ని బట్టి ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ ని జోడించిన నాగ్ అశ్విన్ ఈ సినిమా అద్భుతంగా తేరకెక్కించారు. వరల్డ్ వైస్ గా ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని చెప్పవచ్చు. భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో చూపించడంతో మరింత హైప్స్ పెరిగిపోయింది. మరి వీకెండ్ ముగిసే సమయానికి కలెక్షన్స్ పరంగా ఎలాంటి ట్రెండ్ ను సృష్టిస్తుందో అంటూ అభిమానులు ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఇదే జోరు కొనసాగితే ఇండస్ట్రీలో రికార్డులను సైతం కల్కి చిత్రం తిరగరాస్తుందని విశ్లేషకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: