ఓవర్సీస్ కింగ్ గా మారిన ప్రభాస్.. కల్కి ఆల్ టైం రికార్డ్..!

lakhmi saranya
ప్రభాస్..పరిచయం అవసరంలేని పేరు. పాన్ ఇండియా సినిమా హీరో అంటే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ప్రభాస్. ఎందుకంటే మొట్టమొదటిగా పాన్ ఇండియా సినిమా అనే ట్రెండ్ ని సృష్టించింది ప్రభాసే కనుక. తన ఇమేజ్ కి మరే హీరో సాటి ఉండడు. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే అండ్ దిశా పటాని హీరోయిన్స్ గా నటించిన చిత్రం కల్కి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బేభక్షంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్ అండ్ అమితాబచ్చన్ వంటి స్టార్స్ ముఖ్యపాత్రను పోషించారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన భారీ పాన్ ఇండియా సినిమానే కల్కి. ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు కొన్ని నెలలుగా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రజెంట్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. అయితే ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమా రిలీజ్ గా వచ్చిందని చెప్పొచ్చు. యూఎస్ మార్కెట్లో ఈ చిత్రం లేటెస్ట్ గా భారీ వసూలు అందుకునే ఆల్ టైం రికార్డ్ సొంతం చేసుకుంది.
ఈ మూవీకి నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కి జరిగిన ప్రీ సేల్స్ లో అలాగే రిలీజ్ రోజు వసూళ్లు కలిపి ఒక ఆల్ టైం రికార్డ్ నెంబర్ నమోదు అయినట్లు సమాచారం. కేవలం ఈ మూవీ ప్రీమియర్స్ కే దాదాపు నాలుగు మిలియన్ డాలర్స్ గ్రాస్ ని అందుకోగా మొదటి రోజుకి గాను 1. 59 మిలియన్ డాలర్స్ మార్కెట్ అందుకుంది. ఇక దీంతో ఈ చిత్రం 5.5 మిలియన్ డాలర్స్ మార్కెట్ ని కేవలం ఈ ఒక్కరోజు నాటికే కొట్టేసింది. దీంతో అక్కడ ఈ సినిమా కోసం ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తూ వచ్చారో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మరోసారి ఓవర్సీస్ మార్కెట్లో ప్రభాస్ కి తిరుగు లేదని దీంతో నిరూపించుకున్నాడు. ఇక ఈ మూవీకి నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: