జ‌గ‌న్ చేసిన అవ‌మానం.. ఆలీ అంత‌లా హ‌ర్ట్ అయ్యే రాజీనామా చేశాడా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా , కమెడియన్ గా తనకంటూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు ఆలీ.. ఈయన సినిమాలలో నటిస్తూనే.. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది.. ఆ తర్వాత వైసీపీలోనే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు తాజాగా కమెడియన్ ఆలీ వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.  అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేశారు.  ఇకపై తాను ఏ పార్టీలో ఉండబోనని మరే పార్టీలో కూడా ఉండాలని అనుకోవడం లేదు అని తెలియజేయడం జరిగింది. కేవలం తాను నటుడుగానే కొనసాగుతానంటూ తెలియజేశారు.

అయితే ఆలీ వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే.. అలీ అవమానంగా ఫీల్ అయ్యారని సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే..  2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభ సీటును ఆశించారు .. కానీ ఆ సీటు ఇవ్వకుండా చిన్న కార్పొరేషన్ పదవి ఇచ్చి తనకు సరిపెట్టారు.. అది కూడా ఎన్నికలకు కేవలం కొద్ది నెలల ముందు మాత్రమే.. పదవి ఇవ్వడంతో పాటుగా తనకు రాజ్యసభ సీటు అడిగినా ఇవ్వకపోవడంతో పాటు..  తనకు సీటు కూడా ఇవ్వకపోవడం వల్ల అవమానంగా భావించిన ఆలీ తన స్నేహితులతో చర్చించిన తర్వాత  వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సినీ ఇండస్ట్రీ తనకు మంచి జీవితాన్ని ఇచ్చిందని.. రామానాయుడు  ప్రోత్సాహం వల్లే తాను నటుడిగా ఎదిగారని.. అలాంటి ఆయన కోసం అప్పట్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని.. రామానాయుడు ఎంపీగా పోటీ చేస్తున్న సమయంలో కూడా ఆయన కోసం టిడిపిలో చేరి 20 ఏళ్ల పాటు పార్టీలో  కొనసాగానంటూ తెలిపారు. తన తండ్రి పేరు మీద ఒక ట్రస్టుని పదహారేళ్లుగా నడుపుతున్నానని .. కరోనా సమయంలో తాను ఆ సహాయాన్ని కూడా ఆపలేదు అని.. ఎంతోమందిని చదివించాను అని తెలిపారు.  తన సంపదలో 20% వరకు ట్రస్టులకే ఇస్తున్నానని తెలిపారు.. ఇకమీదట వాటిని చూసుకుంటానని తాను ఏ పార్టీ మనిషిని కాదని..  ఏ పార్టీ మద్దతు పలకడం లేదని.. సామాన్య మనిషి గానే జీవిస్తానని తెలిపారు..  ఇకమీద పూర్తిగా సినిమాల వైపే ఫోకస్ పెడతానంటూ తెలిపారు ఆలీ. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: