కల్కి 2898 AD: బాలీవుడ్ కి సినిమా ఎలా తియ్యలో చూపించిన నాగీ?

Purushottham Vinay
రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి 2898ఏడీ సినిమా నిన్న గ్రాండ్ గా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తుంది. కల్కి 2898 ఏడీ మూవీ ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది.విడుదలకి ముందు ఈ సినిమాకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయిన ట్రైలర్ చూసాకా ఊహించని స్థాయిలో హైప్ అయితే క్రియేట్ అయ్యింది. అందువల్ల ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మొదటి మూడు రోజులకి చాలా చోట్ల థియేటర్స్ అన్ని కూడా హౌస్ ఫుల్ అయిపోయాయి. రెండు ట్రైలర్స్ తోనే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందనేది డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆడియన్స్ కి చూపించాడు. దీంతో కల్కి సినిమా చూడాలనే ఇంటరెస్ట్ అందరిలో పెరిగింది.. మొత్తానికి బ్లాక్ బస్టర్ టాక్ తో ఫస్ట్ రోజు 191.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది ఈ సినిమా. 


నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటాని ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భైరవ పాత్రలో సూపర్ హీరోగా నటించాడు. ఇక దీపికా పదుకునే కల్కికి జన్మనివ్వబోయే సుమతిగా నటించింది. కథ మొత్తం దీపికని కాపాడే చుట్టు తిరుగుతుంది. మూడు గంటల నిడివి ఉన్న కూడా అదిరిపోయే విజువల్స్ తో ప్రేక్షకులని ఈ చిత్రం కట్టిపడేస్తోంది. కచ్చితంగా ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా కల్కి నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమా విజువల్స్ నుంచి యాక్షన్ ఎపిసోడ్స్, స్టోరీ అంతా అబ్బురపరుస్తున్నాయి. ఈ సినిమాని బాలీవుడ్ చూసి పెద్ద షాక్ కి గురవుతుంది. గతంలో వచ్చిన బ్రహ్మస్త్ర, ఆది పురుష్ సినిమాలు కూడా హిందూ దేవుళ్ళ మూలాలతో వచ్చినవే. కానీ వాటిని సరిగ్గా తీయడంలో బాలీవుడ్ మేకర్స్ ఫెయిల్ అయ్యారు. కానీ నాగ్ అశ్విన్ ఇదిరా సినిమా అనే రేంజ్ లో బాలీవుడ్ మేకర్స్ కి సినిమా అంటే ఏంటో చూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: