తెలంగాణ: కొత్త మంత్రులెవ‌రు? క్లారిటీ ఇచ్చిన‌ సీఎం?

Purushottham Vinay
తెలంగాణ - ఇండియా హెరాల్డ్:  తెలంగాణ‌ రాష్ట్రంలో క్యాబినెట్ విస్త‌ర‌ణ ఉంటుందా… ఉండ‌దా… అన్న చ‌ర్చ ఇంకా కూడా సాగుతూనే ఉంది. అయితే మీడియాలో వ‌చ్చిన‌ట్లుగా విస్త‌ర‌ణ కోస‌మే వ‌చ్చామ‌న్న‌ది అబ‌ద్ధ‌మ‌ని, అధినాయ‌క‌త్వం నిర్ణ‌యం ప్ర‌కారం మంత్రి ప‌ద‌వుల‌తో పాటు పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుంద‌ని సీఎం రేవంత్ ప్ర‌క‌టించడం జరిగింది. జులై 7 వ తేదీతో రేవంత్ రెడ్డి పీసీసీ టెన్యూర్ అనేది కంప్లీట్ అవుతుంది కాబ‌ట్టి కొత్త పీసీసీ చీఫ్ ఖాయం కూడా అవుతుంది. పార్టీలో ఉన్న సీనియ‌ర్ల‌తో పాటు కొంత మంది సీనియ‌ర్ ఎమ్మెల్యేలు కూడా అయితే మంత్రి ప‌ద‌వి లేదా పీసీసీ చీఫ్ పోస్ట్ అయినా ఇవ్వాలంటూ కోరుతూ ఉన్నారు.ఇక దీంతో పీసీసీ చీఫ్ పోస్ట్ తో పాటు మంత్రి ప‌ద‌వులు కూడా ఎవ‌రికో తేల్చేయ‌బోతున్నారు. 


పీసీసీ చీఫ్, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లు ఇంకా అలాగే ప్ర‌చార క‌మిటీ వంటి పోస్టులు కూడా కీల‌క‌మే. దీంతో ఢిల్లీలోనే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, పార్టీ ఇంచార్జ్ ఇంకా సీనియ‌ర్ నేత‌లు పార్టీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లనేవి జ‌రుపుతున్నారు. అయితే, మంత్రి ప‌ద‌వుల విష‌యంలో తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఉండ‌టంతో… ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేయడం జరిగింది. తాము కేసీఆర్ లాగా ఇత‌ర పార్టీలో గెలిచిన వారిని పార్టీలో చేర్చుకొని, మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేది భీఫాం మీద పోటీ చేసి, గెలిచిన వారికే మంత్రి ప‌ద‌వులుంటాయ‌ని చెప్పి కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఆశావాహుల్లో కొంత మందికి మంత్రి ప‌ద‌వుల‌తో పాటు పీసీసీ చీఫ్, రెండు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఇంకా అలాగే ప్ర‌చార క‌మిటీ ఇచ్చి రేసులో ఉన్న వారంద‌రికీ న్యాయం చేయ‌బోతున్నారని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: