2 రోజులుగా చెట్టుకు వేలాడుతున్న మృతదేహం.. కిందకు దింపని గ్రామస్తులు.. ఎందుకో తెలుసా..?

praveen
నేటి సమాజంలో హత్యలు ఆత్మహత్యలు అనేది సర్వసాధారణంగా మారిపోయాయి. ముఖ్యంగా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలతో వెన్నులో వణుకు పుట్టక మానదు. ఈ మధ్య కాలంలో ఎంతోమంది దారుణ హత్యకు గురవుతున్న  ఘటనలు కొన్ని వెలుగులోకి వస్తూ ఉంటే ఎంతో మంది చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన లు  కూడా తెర మీదికి వచ్చి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది...  నిజాంబాద్ జిల్లాలో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి చివరికి మనస్థాపం చెంది ఊరి సమీపంలో ఉన్న ఒక చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఊర్లో వాళ్లకి ముఖం ఎలా చూపెట్టాలో  తెలియక మనస్థాపం చెంది చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.  అయితే సదరు వ్యక్తి యొక్క మృతదేహాన్నిచెట్టు నుంచి కిందకు దింప కుండా అక్కడే ఆందోళన చేపట్టారు ప్రస్తుతం కుటుంబ సభ్యులు బంధువులు. నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ఈ ఘటన జరిగింది.



 రెండు నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన మమత అనే మహిళ హత్యకు గురయింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులుగా గంగాధర్ అనే వ్యక్తిని భావించి అతని విచారిస్తున్నారు ఈ క్రమంలోనే మనస్థాపం చెందిన గంగాధర్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని మృతదేహాన్ని చెట్టు నుంచి కిందకు దించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేంతవరకు చెట్టు నుంచి మృతదేహాన్ని కిందకి దింపము అంటూ ఆందోళన చేపట్టారు.  హత్య కేసులో అసలు నిందితులను వెంటనే అరెస్టు చేసి రెండు కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన గ్రామస్తులు మాత్రం తినలేదు. దీంతో రెండు రోజులుగా మృతదేహం చెట్టుకు అలాగే వేలాడుతూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: