దారుణం : 200 అప్పు ఇవ్వలేదని.. ప్రాణం తీసేసాడు..?

praveen
ఈ మధ్య కాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. చిన్నచిన్న కారణాలకే దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అసలు మనుషుల్లో మానవత్వం ఉందా లేదా అన్న విధంగా మారిపోయింది నేటి రోజుల్లో తెర మీదకు వస్తున్న ఘటనలు చూస్తుంటే. అంతే కాదు ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు ప్రాణం తీసేస్తారు అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో  తెర మీదకి వస్తున్న హత్య ఘటనలన్నీ ఏకంగా సొంత వారిని చిన్న చిన్న కారణాలకు హత్యచేసిన ఘటనలే  కావడం గమనార్హం. ఇలా రోజురోజుకు క్రైమ్ రేటు పెరిగి పోతూనే ఉంది.

 మనుషుల్లో మానవత్వం కరువై సొంత వారి ప్రాణాలను తీయడమే కాదు... మనుషుల ప్రాణం తీస్తే కఠిన శిక్షలు పడతాయని భయం మాత్రం ఎవ్వరి  లో కనిపించడం లేదు. వెరసి  రోజురోజుకు దారుణ హత్య ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్నచిన్న కారణాలకే ఇలా దారుణంగా ప్రాణాలు తోడేస్తున్న  ఘటనలు అందరిని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

 200 అప్పు ఇవ్వలేదు అన్న కారణంతో ఏకంగా ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి పోయి ప్రాణం తీసిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. అలీగడ్ కు చెందిన అన్సర్ అహ్మద్ అనే 30 ఏళ్ల వ్యక్తి మెకానిక్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అతనికి  ముగ్గురు పిల్లలు ఉన్నారు.. ఈక్రమంలోనే ఆసిఫ్ అనే వ్యక్తి సదరు వ్యక్తి యొక్క మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చి మోటార్ సైకిల్ అద్దెకు తీసుకున్నాడు.  ఇక ఆ తర్వాత మళ్లీ వచ్చి రెండు వందల రూపాయలు అప్పు ఇవ్వాలి అంటూ కోరాడు. ఇచ్చేందుకు అన్సర్ అహ్మద్ నిరాకరించడంతో రెచ్చిపోయిన ఆసిఫ్ నాటు తుపాకితో అన్సర్ అహ్మద్ తలపై కాల్చాడు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. ఇక క్షణాల వ్యవధిలోనే అన్సర్ అహ్మద్ మృతిచెందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: