ప్రభుత్వం ఇకమీదట ఓటీటీ, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ పై కూడా నియంత్రణ విధింపు..
ఇది కాకుండా, స్ట్రీమింగ్ అలాగే డిజిటల్ మీడియాల ప్లాట్‌ఫాంలో క్లియరెన్స్ గురించి దిగులు చెందకుండా తమ కంటెంట్‌ను రిలీజ్ చేయడానికి అవకాశం దొరికిందని.. ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఓటీటీ ప్లాట్‌ఫాంలను నియంత్రించాలనే పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ కూడా జరిగింది. ఈ పిటిషన్ పై స్పందన కోరుతూ కేంద్రం, సమాచార,ఇంటర్నెట్, ప్రసార మంత్రిత్వ శాఖ, ఇంకా మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సుప్రీమ్ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనితో డిజిటల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ కోర్టుకు తెలిపింది.
ఈ క్రమం లోనే ప్రస్తుతం కేంద్రం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ఈ అంశంపై సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మీడియాతో మాట్లాడుతూ.. మీడియా స్వేచ్ఛను అదుపు చేసేలా ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని తీసుకోదని, ప్రింట్, ఎలక్ట్రానిక్, సినిమాలకు ఉన్న విధంగానే ఓటీటీలపై కూడా నియంత్రణ ఉండాలని సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. కాబట్టి సమాచార, ప్రసార శాఖ పరిధి లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.