యూపీలో మరో దారుణం.. బాలికపై బంధువులే కన్నేశారు.. చివరికి మత్తుమందు ఇచ్చి..?
కామందుల బారిన పడకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా మహిళల జీవితాన్ని అంధకారం లోకి నెడుతూనే ఉన్నారు కామాంధులు. రోజురోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో దళిత యువతిపై కొంతమంది యువకులు అత్యాచారం చేసి దారుణంగా దాడి చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. ఈ ఘటనలో నిందితులకు ఉరిశిక్ష వేసి చంపాలి అంటూ రోజురోజుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
కామంతో కళ్లుమూసుకు పోయిన ఇద్దరు యువకులు 15 ఏళ్ల వయస్సు గల బాలికలను ఎత్తుకెళ్లి మత్తు మందు ఇచ్చి మరీ అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ కు దిగిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో వెలుగులోకి వచ్చింది. బంధువులైన ఇద్దరు యువకులు పదిహేనేళ్ల బాలికను ఎత్తుకెళ్లి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు.. తర్వాత అదంతా వీడియో తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేయడంతో.. తన తండ్రితో కలిసి పోలీసులను ఆశ్రయించింది బాధిత బాలిక. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.