నగరవాసులు జాగ్రత్త.. తొందర పడితే ప్రాణం పోతుంది..?
ఇక ఇటీవలే శుక్రవారం కూడా నగరం మొత్తం కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం మొత్తం జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తూ పూర్తిగా రహదారులన్నీ జలమయమై పోయాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని రహదారులన్నీ పూర్తిగా పెద్ద పెద్ద చెరువులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఎక్కడ మ్యాన్హోల్స్ ఉన్నాయ్.. అసలు ఎక్కడ రోడ్డు ఉంది అని కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతిరోజూ ఆఫీస్ కు వెళ్లే ఎంతో మంది ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పూర్తిగా జలమయమైన రోడ్లు పై వెళితే ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయో అని జంకుతున్నారు. ఇక ఈ రోజు రేపు కూడా రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని... ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ వాతావరణశాఖ అధికారులు సూచించారు. లేనిపక్షంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.