గుడ్ న్యూస్.. ఇక విద్యార్థులు కూడా షిఫ్టుల్లోనే..?

praveen
కరోనా  వైరస్ ప్రభావం కారణం గా దేశ వ్యాప్తం గా అన్ని రకాల విద్యా సంస్థలు మూత పడిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడో  ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం కూడా ఎంతగా నో ఆలస్యమైంది. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యా సంస్థల పునః ప్రారంభాని కి అనుమతులు వచ్చాయి. అయితే ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభాని కి ఆలస్యమైన నేపథ్యం లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగం గా ప్రణాళికలు సిద్ధం చేస్తూ విద్యా సంస్థలను పునఃప్రారంభించి  విద్యార్థులందరికీ విద్యా బోధన చేసేందుకు సిద్ధపడుతున్నారు.

 ఇక విద్యా సంస్థల పునః ప్రారంభాని కి తెలంగాణ ప్రభుత్వం కూడా శరవేగం గా కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని  కోర్సులకు సంబంధించిన పరీక్షల ను కూడా శరవేగం గా పూర్తి చేసిన తెలంగాణ సర్కార్... కొన్ని రోజుల్లో ఇంటర్ కళాశాలలు  ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యం లో ఏ  పొరపాటు జరిగినా విద్యార్థుల ప్రాణాల కు హాని కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి... విద్యార్థులకు జూనియర్ కళాశాల ప్రారంభం విషయం లో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది తెలంగాణ సర్కార్.

 ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతి రాగానే షిఫ్ట్ పద్ధతిలో జూనియర్ కళాశాలల ను నిర్వహించాలి అని తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు పంపగా ప్రభుత్వం కూడా దీనికి ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు... తరగతులు నిర్వహించేందుకు నిర్ణయించిన ఇంటర్ బోర్డు... ఇక మొదటి సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు క్లాసులు నిర్వహిస్తామంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: