భారత్‌కు స్పుత్నిక్‌-V కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ !

NAGARJUNA NAKKA
రష్యా తయారుచేసిన కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-V... భారత్‌కు కూడా రానుంది. మన దేశంలో క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టడంతో పాటు... 10 కోట్ల డోసుల టీకాను సరఫరా చేసేందుకు... డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఒప్పందం చేసుకుంది. అనుమతులు రాగానే క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలవుతాయి.

రష్యాలో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-V ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయి. ఇప్పటిదాకా వచ్చిన వీటి ఫలితాలు... స్పుత్నిక్‌-V వ్యాక్సిన్‌ సురక్షితమేనని స్పష్టం చేస్తున్నాయి. దీంతో... ఈ టీకా ప్రయోగాలను భారత్‌లోనూ జరిపేందుకు రంగం సిద్ధమైంది. క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించడంతో పాటు... 10 కోట్ల డోసుల టీకా  సరఫరా చేసేందుకు... డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రాగానే... ప్రక్రియ ప్రారంభిస్తామని ఆర్ డీఐఎఫ్ వెల్లడించింది.

ప్రయోగాలు విజయవంతమై, భారత్‌కు టీకా సరఫరా మొదలుకావడానికి ఈ ఏడాది చివరిదాకా సమయం పడుతుందని ఆర్ డీఐఎఫ్ అభిప్రాయపడింది. కరోనా మహమ్మారిపై పోరాటంలో ఎంతో సురక్షితమైన తమ వ్యాక్సిన్‌... ఇండియాకు ఎంతో మేలు చేస్తుందని ఆర్ డీఐఎఫ్ వ్యాఖ్యానించింది. అటు రెడ్డీస్‌ ల్యాబ్‌ కూడా... స్పుత్నిక్‌-V తొలి, రెండో దశ ప్రయోగాలు విజయవంతమయ్యాయని... నిబంధనలకు లోబడి భారత్‌లో మూడో దశ ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
కరోనా వైరస్‌ను జయించేందుకు వ్యాక్సిన్‌ కనిపెట్టామని రష్యా ప్రకటించాగానే... ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. టీకా ప్రయోగాల్లో ఎలాంటి దుష్ర్పభావాలూ తలెత్తకపోవడంతో... రష్యా వ్యాక్సిన్‌పై భారీ ఆశలే ఉన్నాయి. దీనిపై రష్యా అధికారులతో చర్చలు జరిపేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది. రష్యా దౌత్య వర్గాలతో ఈ కమిటీ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఐసీఎంఆర్‌ ఇప్పటికే వెల్లడించింది.
మొత్తానికి రష్యాలో కరోనా టీకా స్పుత్నిక్-వి ప్రయోగాలు మూడోదశలో ఉన్నాయి. స్పుత్నిక్‌-V ప్రయోగాలను భారత్‌లోనూ జరిపేందుకు రంగం సిద్ధమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: