తండ్రిని చంపిన కూతురు.. ఎంకరేజ్ చేసిన తల్లి.. అసలేం జరిగిందంటే..?

praveen
రోజురోజుకు నేటి సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి. బంధాలకు బంధుత్వాలకు అసలు విలువ లేకుండా పోతుంది, కట్టుకున్న బంధాన్ని... కాదని వేరొకరి మోజులో పడి ఏకంగా... జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఎంతోమంది, బంధాలకు బంధుత్వాలకు విలువనివ్వకుండా ఏకంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా చాలానే తెర మీదకు వస్తున్నాయి, తాజాగా జరిగిన ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. పెళ్లయిన కొద్ది రోజులకే భర్తను వదిలేసిన కూతురు బరితెగించింది.. బంధువు తో అక్రమ సంబంధానికి తెరలేపింది. అంతేకాదు ఈ దారుణానికి కన్నతల్లి కూడా వంత పాడడం మరింత దారుణంగా మారిపోయింది, అయితే బంధువు తీరుపై అనుమానం వచ్చిన తండ్రి ఆరా తీయడంతో అసలు  విషయం బయటపడింది

 ఇక ఇలా చేయడం తప్పు సరైన మార్గంలో నడవాలి అంటూ తండ్రి కూతురికి సూచించడమే... తండ్రికి శాపంగా మారిపోయింది, కూతురిని సక్రమంగా ఉండాలంటూ  తండ్రి హెచ్చరించడంతో ఏకంగా తండ్రిని చంపేందుకు కూడా వెనకాడలేదు కూతురు. ఈ దారుణ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... విల్లుపురం జిల్లా వడవం  పాలయం  కి చెందిన ధన శేఖర్ స్థానికంగా ఓ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. అతనికి భార్య రాజేశ్వరి కూతురు సత్య ఉన్నారు. ఇటీవలే కూతురు సత్య కి పెళ్లి జరగగా..  కొద్ది నెలాల్లోనే  భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చింది,


 ఈ క్రమంలోనే  సమీప బంధువైన మురుగవేల్ తో  అక్రమ సంబంధానికి తెరలేపింది కూతురు సత్య. ఇక సమీప బంధువైన మురుగవేల్  తరచు ఇంటికి వస్తూ ఉండడం గమనించిన ధన శేఖర్ కు .. కూతురు సాగిస్తున్న రాసలీలల విషయం బయటకు తెలిసింది. దీంతో భర్తతో బుద్దిగా  కాపురం చేసుకోకుండా ఈ పాడుపని ఏంటి అంటూ కూతురు ని మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని అంటూ హెచ్చరించాడు. ఇక తండ్రి హెచ్చరించడంతో కూతురు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయి  ఏకంగా తండ్రి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నది . ఏకంగా తల్లి సాయంతో అమానుషంగా తండ్రిని హత్య చేసింది కూతురు. సమాచారం  అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. కుటుంబీకులను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: