విచిత్ర ఘటన.. గదిలోకి వెళ్లి గడియ పెట్టిన కుక్క.. చివరికి ఏం చేసిందంటే..?
సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది ఈ విచిత్ర ఘటన, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లోని తుర్క పల్లి తాండ శివారులో.. వైకుంఠధామం నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే ఒక గదిని కడుతున్నారు, అందరూ పక్కనే ఉండగానే ఒక శునకం ఆకస్మాత్తుగా గదిలోకి వెళ్ళింది. అక్కడే ఉన్న వ్యక్తులు శునకాన్ని గమనిస్తూనే ఉన్నారు. గదిలోకి వెళ్లి వెంటనే గడియ పెట్టుకుంది శునకం. దీంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ఇంతకీ లోపలికి వెళ్లి గడియ పెట్టకుని ఆ కుక్క ఏం చేస్తుందా అని.. కిటికీలోంచి చూసారు అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు,
ఆ కుక్క చేస్తున్న పని చూసి అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే తలుపు గడియ పెట్టుకొని హాయిగా ఆ కుక్క లోపల నిద్రపోయి ఉంది, దీంతో షాక్ అయిన కూలీలు సమీపంలో ఉన్న ఓ పొడవైన కర్ర సహాయంతో తలుపు గడియను తీశారు, వీళ్లు తలుపు తీశారో లేదో క్షణాల్లో గదిలో నుంచి పరారై పోయింది కుక్క . ఇక ఆ శునకం తెలివి చూసి అక్కడున్న వాళ్ళందరూ అవాక్కయ్యారు అనే చెప్పాలి. ఏదేమైనా శునకం ఇలా లోపలికి వెళ్లి తలుపు గడియా పెట్టుకుని హాయిగా నిద్ర పోవడం మాత్రం స్థానికులను అందరినీ కొంత ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి,