కొడుక్కి కరోనా వచ్చిందని.. ఏకంగా ప్రకాశం బ్యారేజిలోకి...?

praveen
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్న  తరుణంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రభుత్వం కరోనా  వైరస్ నియంత్రణపై ఎన్ని చర్యలు చేపడుతున్న ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. వైరస్ బారిన పడకుండా ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. అయితే ఈ వైరస్ బారిన పడి చనిపోతున్నా వారి సంఖ్య పెరగడమే కాదు ఈ వైరస్ కారణంగా మనస్తాపం చెంది బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

 కరోనా వైరస్ పై అవగాహన లేమితో ఎంతో మంది తీవ్ర భయాందోళనకు గురై కుంగిపోయి ఏకంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అధికారులు ప్రభుత్వం ప్రజల్లో కరోనా  వైరస్ పై అవగాహన తీసుకొచ్చేందుకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ రోజురోజుకు కరోనా  వైరస్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది, తాజాగా ఇలాంటి  ఘటన జరిగింది. కొడుకు కరోనా సోకింది అన్న మనస్తాపంతో తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు, కాలువలో దూకి బలవన్మరణానికి యత్నించాడు. ఈ ఘటన మచిలీపట్నం లో  చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన నాగేశ్వరరావు ఒక కుమారుడు ఉన్నాడు, ఇటీవలే అనారోగ్యం బారినపడిన అతన్ని కరోనా  పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా... కొడుక్కి కరోనా   రావడంతో తండ్రి  నాగేశ్వరరావు తీవ్ర మనస్తాపం చెందాడు. శుక్రవారం ప్రకాశం బ్యారేజీ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గమనించిన ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అతడిని కాపాడి ఆస్పత్రికి తరలించారు, దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఆ వ్యక్తి.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: