దారుణం : భార్య కళ్ళ ముందే బావమరిదిని చంపిన భర్త.. కారణమేంటంటే..?
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న విషయం తెలిసిందే. చిన్న కారణాలకే ఏకంగా దారుణంగా ప్రాణాలను సైతం తీసేస్తూన్నారు. భార్య భర్తల మధ్య జరిగిన గొడవలో పక్కవాళ్ళు సైతం ప్రాణాలు కోల్పోతున్న దుర్ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా భార్య ముందే భార్య తమ్ముడు ని అతి దారుణం అతి దారుణంగా హత్యచేశాడు భర్త. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది ఈ ఘటన . వేజలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే సమీరా భానుకు ఇమ్రాన్ ఖాన్ తో 16 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పెళ్లయిన మూడేళ్ళ వరకు వీరి కాపురం ఎంతో అన్యోన్యంగా సాగింది. కానీ తర్వాత వివాహేతర సంబంధం వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం భార్య వరకు వచ్చింది... ఇక ఈ విషయంపై భర్తను ప్రశ్నిస్తే భార్యను దారుణంగా తిట్టడం... మరి ఎక్కువ మాట్లాడితే కొట్టడం లాంటివి చేసేవాడు భర్త.
భర్త అరాచకాలను కొన్ని రోజుల వరకు భరించిన భార్య ఆ తర్వాత ఓపిక నశించి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అత్తారింటికి వెళ్ళిన సల్మాన్ ఖాన్... తన వెంట రావాలంటూ భార్య ని పిలిచాడు కానీ భార్య మాత్రం ససేమిరా అంది. కోపోద్రిక్తుడైన సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు, తమ్ముడు ముందే మహిళను దారుణంగా కొట్టాడు, దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన సమీరా తమ్ముడు.. సల్మాన్ ఖాన్ పైకి ఎదురుతిరిగారు. దీంతో పక్కనే ఉన్న స్క్రూ డ్రైవర్ ని చేత పట్టుకున్న సల్మాన్ ఖాన్ బావమరిది కడుపులో విచక్షణ రహితంగా పొడిచాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. షాక్ నుండి తేరుకున్న తల్లిదండ్రులు బాధితుని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.