జగన్ సత్తా తేలాలంటే .. అది జరిగి తీరాల్సిందే ?

జగన్ ఏడాది పాలన జనరంజకంగానే ఉందా ? లేక జనాలు అసంతృప్తికి కారణం అవుతుందా ? వైసిపి పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఏడాది పరిపాలనలో పదేళ్లకు సరిపడగా అభివృద్ధి చేసి చూపించారు. ప్రజలు అడిగినవి, అడగనవి అన్ని చేసి చూపించారు. లాక్ డౌన్ సమయంలో ఆర్థికంగా జనాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉన్నా, ఏదో ఒక పథకం పేరు చెప్పి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లోకి సొమ్ములు జమ అయ్యేవిధంగా చేసి వారి ఇబ్బందులు పడకుండా చేయగలిగాడు. ఇటువంటి ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలు జగన్ చేసి చూపించారు. కరోనా పరీక్షలు నిర్వహించడం, ఆ వ్యాధికి గురైన వారికి చికిత్స అందించడం వంటి అన్ని విషయాల్లోనూ, దేశవ్యాప్తంగా జగన్ మంచి పేరు సంపాదించుకున్నారు.

 

 

సరిగ్గా ఇదే సమయంలో సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అసమ్మతి గళం వినిపించడం, పదేపదే విమర్శలు చేస్తూ, పార్టీకి పెద్ద తలనొప్పిగా మారడం వంటి పరిణామాలను జగన్ సీరియస్ తీసుకున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయించి  మరొకరు ఎవరూ అసమ్మతి రాగం వినిపించకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే లోక్ సభ స్పీకర్, ఓం బిర్లా కు అనర్హత వేటు వేయాల్సింది ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఆయనపై అనర్హత వేటు పడితే, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక వస్తుంది. అప్పుడు ఆ ఎన్నికలను తన పాలనకు రెఫరెండంగా భావించాలని జగన్ ఆలోచిస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు.

 

గతేడాదిగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇతర విషయాలు కానీ ఏదైనా ఎన్నికలు జరిగితే తీవ్ర ప్రభావం చూపిస్తాయి అనడంలో సందేహం లేదు. అదీ కాకుండా, తాను జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదని, ఎమ్మెల్యేలే నా బొమ్మ పెట్టుకుని గెలిచారని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడంతో, ఎన్నికల కనుక జరిగితే దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం లేకపోలేదు. అలాగే ఒక్కో ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందితే మరికొంతమంది అసమ్మతి వాదులు బయలుదేరడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా జగన్ పరువు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినా జగన్ మాత్రం నరసాపురం ఉప ఎన్నికలు రావాలని, ఆ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనంగా ఉండాలని భావిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: