ఏపిలో ఇంటర్ ఫెయిల్ అయ్యామని ఆత్మహత్య!

Edari Rama Krishna

దేశంలో ఇప్పడు ఎక్కడ చూసినా కరోనా మహమ్మారితో నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచంలోనే నాలుగో స్థానం భారత్ చేరిందంటే ఇక్కడ కరోనా తీవ్ర ఎంతగా ఉందో అర్థం అవుతుంది. ఫిబ్రవరి నెలలో కరోనా వైరస్ మొదలైంది. ఆ తర్వాత మార్చిలో లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం.  అప్పటి నుంచి లాక్ డౌన్ కంటిన్యూ అవుతూనే ఉంది.. కాకపోతే సడలింపులు ఇస్తున్నారు. ఇక కరోనా వల్ల విద్యా వ్యవస్థపై దారుణమై ప్రభావం పడింది. కరోనా ఇబ్బందులు ఉన్నా ఏపిలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలు రిలీజ్ చేశారు.  చాలా మంది ఉత్తీర్ణులయ్యారు.. కొంత మంది ఫెయిల్ అయ్యారు. తాజాగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన ముగ్గురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.

 


ఏపీలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన కీర్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లుకు చెందిన స్నేహలత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.  ఆదివారం గోదావరి నదిలో విగతజీవిగా కనిపించిన కుమారుడిని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ మూడు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 


రాజమహేంద్రవరానికి చెందిన సాయిబాబా ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.  గత ఏడాది తెలంగాణలో ఇంటర్ రిజల్ట్ తారుమారై ఎంతో మంది విద్యార్థులు షాక్ కి గురయ్యారు.. కొంత మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కాగా, ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రం చావాల్సిన అవసరం లేదని.. సప్లమెంటరీ రాసుకొని పాస్ కావొచ్చని.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులకు తెలియజేస్తున్నారు అధికారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: