వైసిపి అధికారంలోకి వచ్చిన పది మాసాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గట్టోడనే విషయాన్ని తెలుగుదేశంపార్టీ అంగీకరించింది. కరోనా వైరస్ విధ్వంసం నేపధ్యంలో జగన్ ను ఇరుకున పెడదామని టిడిపి సీనియర్ నేత దూళిపాళ నరేంద్ర జగన్ కు ఓ లేఖ రాశాడు. అందులో 2018-19 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం పెరిగిందంటూ అంగీకరించాడు. 18-19లో రూ. 1.57 లక్షల కోట్ల ఆదాయం వస్తే 19-20 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1.87 లక్షల కోట్లు ఆదాయం వచ్చిందని టిడిపి అంగీకరిచింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొన్నటి వరకూ జగన్ తుగ్లక్ పరిపాలన వల్ల రాష్ట్రం అధోగతిలోకి వెళ్ళిపోయిందన్నారు. పరిశ్రమలు పారిపోతున్నాయన్నారు. ఆదాయాలు గణనీయంగా పడిపోతోందని ఇదే టిడిపి గగ్గోలు పెట్టింది. నోటికేదొస్తే అదల్లా తన పచ్చమీడియాతో రాయించింది, బురద చల్లించింది. ఇంత చేసిన టిడిపి నోటి నుండి ఇపుడు అసంకల్పితంగా నిజాలు బయటకు వచ్చేసింది. అదేమిటంటే చంద్రబాబు పరిపాలనతో పోల్చుకుంటే జగన్ పరిపాలనలో రూ. 30 వేల కోట్ల ఆదాయం పెరిగిందని.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన పాలకుడు చేతకాని వాడు ఎలాగవుతాడా లేకపోతే రాష్ట్ర ఆదాయాన్ని వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవటానికి, విదేశీ ప్రయాణాలకు, ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనా వ్యయాలను పెంచేసి మద్దతుదారులకు దోచిపెట్టినవాడు చేతకానివాడవుతాడా ? రాష్ట్ర ఆదాయం పెరిగిందని ఒప్పుకోవటం ద్వారా పరిపాలనలో జగన్ గట్టోడే అని టిడిపినే ఒప్పుకున్నట్లైంది. అంటే తమ అధినేత పరిపాలనలోని డొల్లతనాన్ని పార్టీ సీనియర్ నేత దూళిపాళే గాలి తీసేసినట్లయింది.
నిజానికి దూళిపాళతో లేఖ రాయించిందే చంద్రబాబు. జీతాలను రెండు వాయిదాల్లో చెల్లించాలన్న జగన్ నిర్ణయంపై ఉద్యోగులను రెచ్చ గొట్టేందుకు టిడిపి ఓ పద్దతి ప్రకారం ప్రయత్నిస్తోంది. అయితే విజ్ఞులైన ఉద్యోగులు టిడిపి ఉచ్చులో పడకుండా జగన్ నిర్ణయానికి సానుకూలంగా ఉన్నారు. అంటే ఉద్యోగులకున్న ఇంగితం కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి లేకపోయింది.
మరింత సమాచారం తెలుసుకోండి: