దేవుడి స్క్రిప్ట్ అంటే ఏమిటో మీకీపాటికే అర్ధమైపోయుండాలి. అదేనండి మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు మాత్రమే గెలవటం. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మాట్లాడుతూ తమనుండి లాక్కున్న 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు మాత్రమే టిడిపి తరపున గెలవటం దేవుడి స్క్రిప్టే అంటూ చంద్రబాబునాయుడును ఎంతగా ఎగతాళి చేశాడో అందరూ చూసిందే. అప్పటి నుండే దేవుడి స్క్రిప్ట్ అంటూ బాగా పాపులర్ అయ్యింది.
ఇపుడా దేవుడి స్క్రిప్ట్ ను మార్చి రాయాలని జగన్ డిసైడ్ అయ్యాడని పార్టీ వర్గాల సమాచారం. స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశంపార్టీలోని చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలను జగన్ పార్టీలోకి చేర్చుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే. ఇంతకాలం టిడిపి నుండి చేరికల విషయాన్ని జగన్ పట్టించుకోలేదు. చాలామంది అడుగుతున్నా జగన్ సానుకూలంగా స్పందించలేదు. అలాంటిది స్ధానిక ఎన్నికల సందర్భంగా ఒక్కసారిగా జగన్ గేట్లెత్తేశారు.
జగన్ గేట్లెత్తేయగానే గడచిన మూడు రోజుల్లో వివిధ జిల్లాల్లోని దాదాపు 10 మంది కీలక నేతలు జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు. ఇంకా చాలామంది క్యూలో ఉన్నారట. సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే టిడిపిలోని ఎంఎల్ఏల్లో చాలామంది బయటకు వచ్చేయటానికి రెడీ అయిపోతున్నారట. ఇప్పటికే ముగ్గురు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరామ్ బయటకు వచ్చేసినట్లే అనుకోవాలి.
అంటే మిగిలిన 20 మంది ఎంఎల్ఏల్లో కూడా ఓ పదిమంది తొందరలోనే బయటకు వచ్చేయబోతున్నట్లు సమాచారం. వీరంతా ఓ గ్రూపుతా తయారయ్యేందుకు ప్లాన్ జరుగుతోందట. పదిమంది ఎంఎల్ఏలు బయటకు వచ్చేస్తే వెంటనే జరగబోయేదేమిటంటే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పోతుంది. అంటే చంద్రబాబుకు క్యాబినెట్ హోదా గోవిందా. ప్రోటోకాల్ ప్రకారమైతే జగన్ తర్వాత స్ధానం చంద్రబాబుకే దక్కుతోంది. ఆ తర్వాతే మంత్రులొస్తారు. ఇపుడా స్ధానం పోతే చంద్రబాబు మామూలు ఎంఎల్ఏగా మాత్రమే మిగిలిపోతారు. మరిపుడు తేలాల్సిందేమిటంటే ముహూర్తం ఎప్పుడనే.
మరింత సమాచారం తెలుసుకోండి: